Samantha : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. బాలీవుడ్ లో కూడా తనకు ఒక స్థానాన్ని కల్పించుకోవడానికి ట్రై చేస్తూ.. వెబ్ సిరీస్ లో హాలీవుడ్ రేంజ్ లో నటిస్తూ.. కెరియర్ తో ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉన్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగచైతన్యతో కలిసి మొదటి సినిమా తెలుగులో ( Samantha fans latest comments ) హీరోయిన్గా నటించి ఆమె తెచ్చుకున్న నేమ్ మామూలుది కాదు. ఆ సమంతాని మళ్లీ చూడాలని ఇప్పటివరకు ఆమె అభిమానులు అనుకుంటూనే ఉంటారు. గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాలో అనేక మందితో అనేక రకాలైన నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొక తప్పడం లేదు. అసలు సమంత ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. సొసైటీలో ఎన్నో మంచి పనులు చేస్తూ.. ఎంతో పేరు తెచ్చుకుంది. అనేక ట్రస్టులకి హెల్ప్ చేస్తూ పేరు తెచ్చుకున్న సమంత.. నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. ఇంకా తన పేరు ప్రఖ్యాతల్ని పెంచుకుంది.
అక్కినేని అభిమానుల సైతం ఆమె అభిమానులు అయిపోయారు. నాగచైతన్యతో ఆమె జంటని ఎంతగానో పొగుడుతూ, అభిమానిస్తూ.. ఆమె సినిమాలను సూపర్ హిట్ చేసేవారు. పెళ్లి తర్వాత కూడా ఎంతో యాక్టివ్ గా, కెరియర్ ని ఇంకా ఫాస్ట్ చేసిన హీరోయిన్ సమంత అని గట్టిగా చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా.. పెళ్లి తర్వాత ఆమె స్పీడు చాలా వరకు తగ్గుతుంది. కానీ ఇంతలా పెంచుకున్న స్టార్ ( Samantha fans latest comments ) హీరోయిన్ అంటే సమంతానే అనుకోవచ్చు. ఏం జరిగిందో,ఎలాంటి సమస్య వచ్చిందో తెలియదు కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే నాగచైతన్య సమంత విడిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఆమెపై అభిమానం చూపించే అభిమానులు చెదిరిపోయారు. ఒక్కసారిగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అయినా కూడా ఈ నిర్ణయం పై ఎంతోమంది ఎన్నో రకాలుగా నెగటివ్ గా కామెంట్ చేయడం జరిగింది.
అయినా కూడా సమంత దేనిని పట్టించుకోకుండా.. కేవలం తన కెరియర్ గురించి మాత్రమే ఆలోచించి.. తన మట్టుకు తాను ముందుకు వెళ్లడానికి ఏం చేయాలో అవే చేసుకుంటూ వచ్చింది. సమంత ఎన్నుకున్న పాత్రలు చూసి ఎందరో ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సమంత లక్కీ బ్యూటీ అని ఆమె నటిస్తే సినిమాలు హిట్ అవుతాయని పేరు ఉన్న ఆమెకు శాకుంతలం డిజాస్టర్ అయిన తర్వాత డిజాస్టర్ బ్యూటీ అంటూ ( Samantha fans latest comments ) ఆమెని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. సమంత వ్యతిరేక అభిమానులు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న పాయింట్లో కూడా వదలకుండా ఎన్నో రకాలుగా ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే వీటన్నిటికీ సమాధానంగా సమంత అభిమానులు ఏమంటున్నారంటే.. ఎంతమంది ఎన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న.. ఎంత అసహ్యమైన మాటలు అంటున్నా..
ఎలాంటి మాటలతో ట్రోల్ చేస్తున్న కూడా.. ఆఖరికి బూతులు కూడా మాట్లాడుతున్నా కూడా.. ఒక్క సమాధానం కూడా నెగిటివ్గా చెప్పకుండా, సహనంగా ఉంటూ.. తప్పుడు మాటలు మాట్లాడకుండా.. ఓపిగ్గా తన పనిని తను చేసుకుంటూ.. తన కెరియర్లో ముందుకు వెళుతున్న మా సమంతా లాంటి హీరోయిన్ నిజంగా గ్రేట్ అంటున్నారు. ఇలాంటి మాటలు పడితే, ఇలాంటి సమస్యలు వస్తే, ఏ హీరోయిన్ అయినా సూసైడ్ చేసుకుంటుందని కానీ మా సమంత మాత్రం సహనంగా, ధైర్యంగా ఇంకా ముందుకు సాగుతుంది అని కామెంట్ చేస్తున్నారు. సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో కూడా అంత ధైర్యంగా సమంత ఉండటానికి కారణం ఆమె అభిమానుల అభిమానమేనా అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సెలబ్రెటీస్ అన్న తర్వాత వాళ్ల మీద మంచిగానో, చెడుగానో ఏదో ఒక కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని వాళ్ళు ఎప్పుడు లైట్ గానే తీసుకుంటారు తప్ప.. సూసైడ్ ఎవ్వరూ చేసుకోరూ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.