
Samantha : సమంత, ఈ పేరును తరచుగా మనం అందరం వింటూనే ఉంటాం. ఏదో ఒక విషయం పై తరచుగా వార్తల్లో నిలుస్తుంది సమంత. తను ఎం చేసిన కూడా అది నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఫాన్స్ కి తన పై ఉన్న క్రేజ్ అలాంటిది. మయోసిటిస్ వ్యాధి నుండి బాధ పడుతున్న సమంత ఇక సినిమాలు చేయదు అని వచ్చిన వార్తలు మనం అందరం చూసాం. తాను కూడా ఏ సినిమా సైన్ చేయకపోయేసరికి అది నిజమే అని అనుకున్నాం.
ప్రస్తుతం సమంత తన హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ఇది తెలిసి ఫాన్స్ సమంత మల్లి సినిమాలోకి వచ్చేస్తుంది అని తెగ ఆనందపడుతున్నారు. సమంత కూడా తాను ఫాన్స్ కోసం ఒక పోడ్ కాస్ట్ చేస్తున్నాను అని(Samantha Health Podcast), అది తన ఆరోగ్యం గురించి ఉండబోతుంది అని తెలియచేసింది సమంత. ఈ పోడ్ కాస్ట్ వచ్చే వారం రాబోతుంది అని తెలియచేసింది సమంత(Samantha Health Podcast).
ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభిమానుల ఇన్నాళ్ల ఎదురుచూపులు అతిత్వరలో ముగించనుంది సమంత. చాల మంది అభిమానులు ఈ పోస్ట్ చూసి చాల అనాధ పడ్డారు. మరి కొందరు ఐతే సమంత పెట్టిన పోస్ట్ ని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే కారణం ఐతే తెలీదు కానీ తెలిసిందే గా ప్రతి చోట ఇలాంటి నెగిటివ్ గాలు ఉంటారు అని.