Home Cinema Samantha : విడాకులపై అసలు విషయాన్ని బయటపెట్టిన సమంత..

Samantha : విడాకులపై అసలు విషయాన్ని బయటపెట్టిన సమంత..

Samantha comments about her life

Samantha : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరో సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సమంత. ఎప్పటికప్పుడు తనకు దొరికిన పాత్రలో ( Samantha comments about her life ) తాను ఇమిడిపోయి ఎంతో అద్భుతంగా నటిస్తూ అందరి మన్ననలను పొందిన హీరోయిన్. అయితే ఇప్పుడు సమంత క్రేజ్ కొంత తగ్గిందనే అనుకోవాలి. ప్రజెంట్ ఆమెకు స్టార్ హీరోలు సరసన హీరోయిన్గా పాత్రలైతే పెద్దగా రావడం లేదు.

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతటితో ఆమె ఆదరణ ఆగిపోలేదు, అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్లి అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందరో అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని ( Samantha comments about her life ) సంపాదించుకుంది. ఎంతో చక్కటి జంట కేవలం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడిపోవడం జరిగింది. విడాకులు తీసుకున్న ఈ జంట ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కడా కూడా ఎలాంటి కామెంట్ చేసుకోలేదు. ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు కెరీర్ కోసం పాట్లు పడుతూ ముందుకు వెళ్లే పనిలో ఉన్నారు.

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

అయితే విడాకుల తర్వాత సమంత ఆరోగ్యం చాలా వరకు పాడయింది. మయోసైటిస్ అనే వ్యాధితో సమంత ఎంతో బాధపడింది. కానీ ఆ జబ్బును కూడా తాను ఎంతో ధైర్యంతో ఎదుర్కొని బయటపడింది. ఇలా సమంత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇన్నాళ్లకు ఆమె నోటి వెంట ( Samantha comments about her life ) కొన్ని మాటలు విన్నాక.. అందరిలో కొన్ని అనుమానాలు బయలుదేరాయి. ఇటీవల సమంత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేసింది. ఆమె తన జీవితం గురించి మాట్లాడుతూ జీవితంలో కొన్ని జరిగేటప్పుడు మనకు తెలియదు కానీ.. అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఇలా జరిగిందా? అలా జరగకుండా ఉంటే బాగుండును అనిపిస్తుంది.

See also  Rajinikanth: ఆ విషయంలో ఇండియాలో అందరి హీరోలకంటే గ్రేట్ అనిపించుకున్న రజనీకాంత్..

కానీ జరిగిపోయిన దానిని మనం ఇంకేమీ చేయడానికి సాధ్యం కాదు అని చెప్పుకొచ్చింది. అయితే ఈ మాట కచ్చితంగా తన విడాకుల గురించి చెప్పిందని అభిమానులు అందరూ అనుకుంటున్నారు. విడాకులు తీసుకుని తప్పు చేశానని, అలా జరిగిపోయిందా అని ఇప్పుడు సమంత బాధపడుతుందని.. అందుకే ఆమె ఇప్పుడు దాన్ని చక్కదిద్దుకోలేక ఇలా అంటుందని అనుకుంటున్నారు. అంతేకాకుండా సమంత తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చానని.. సమర్థవంతంగా, ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు ఇలా నిలబడ్డానని చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా సమంత ఆరోగ్యంగా, ఆనందంగా తన కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్ళాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.