Samantha: శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషిలో విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్నారు. నగం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదకావాల్సిన ఈ చిత్రం సమంతకు మయోసైటిస్ రావడంతో బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతానికి సామ్ మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకకు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. చేతిలో జపమాల, అద్దాలతో పూర్తిగా మారిపోయింది.
సోషల్ మీడియాలో తన హుషారును పెంచి వర్కౌట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ, అప్డేట్లను ఫాలోవర్లతో పంచుకుంటుంది. ప్రస్తుతం సమంత తన తదుపరి ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషిలో పాల్గొంటుందనుకున్నారు కానీ ఈ చిత్రం పూర్తికాకుండానే బాలీవుడ్ లో సిటాడెల్ సినిమాలో నటించనుందట, అమెరికా ఆంగ్లచిత్రమైన సిటాడెల్ హిందీలో రీమేక్ చేయనున్నారట.
ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ మరియు డికె ఈ రిమేక్ తీయనున్నారు. ఇందులో సమంత – వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్స్ లో సమంత పాల్గొన్నట్లు అధికార ప్రకటన వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ చిత్రానికి సమంత డేట్స్ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యింది. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ఖషి సినిమా సంగతేంటని సమంతను ప్రశ్నించగా సమంత స్పందించింది.
విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపనలు. ఖుషి సినిమా షూటింగ్ తిరిగి అతి త్వరలో ప్రారంభించనున్నాము అని శుభవార్త చెప్పింది. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత అభిమాని చేసిన ట్విట్ రిప్లైపై విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. పూర్తి ఆరోగ్యంతో చిరునవ్వుతో తిరిగి వచ్చేవరకూ ఎదురుచూస్తామంటూ కామెంట్ చేసాడు. మొత్తానికి ఖుషి సినిమా పై వచ్చిన అప్డెడ్స్ కి సమంత – విజయ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
We all await your return in full health and your big smile ❤️ https://t.co/kuSN1ZdGj3
— Vijay Deverakonda (@TheDeverakonda) February 1, 2023