సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి వెలుగు వెలుగుతుందో అందరికీ తెలుసు. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా చాలా బాగా రాణిస్తుంది. అలాగే ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన రాశికన్నా, తనదైన శైలిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె చేసిన పలు సినిమాలు హిట్ లిస్ట్ లోకి చేరాయి. పైగా ప్రతీ సినిమాలో కొంత కొత్తగా కనిపిస్తుంది.
సినిమాల్లో ఎంటర్ అయితేనే అందరూ స్టార్ లు అవ్వలేరు. ఎవరు ఒక మంచి స్థానాన్ని సంపాదించాలన్నా.. కృషి, పట్టుదల ఉండాలి. వాటితో పాటు అదృష్టం కూడా తోడు అవ్వాలి గాని.. కృషి, పట్టుదలని మాత్రం వదలకూడదు. సమంత అంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆమె కష్టమే. సినిమాల కోసం, తన పర్సనల్ లైఫ్ నే కాదనుకుని వదిలేసింది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో సమంత ఇప్పుడు నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది.
అలాగే రాశికన్నా కూడా కృషి, పట్టుదల ఉన్న మనిషి. సమంత లానే ఈమె కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుని, బాలీవుడ్ కి ట్రై చేసింది. ఆ దిశగా వెళ్లి ఈమె కూడా సక్సెస్ అవుతుంది. తాజాగా ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది . విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ తో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. రాశిఖన్నా యాక్షన్ సీక్వెన్స్ లో ఫైట్స్ అదరగొట్టింది.
అంతా బాగానే ఉంది కానీ.. సమంత, రాశీఖన్నాలు ఇద్దరూ ఒక లాజిక్ మిస్ అవుతున్నారేమో అని నెటిజనులు అంటున్నారు. అదేమిటంటే.. బాలీవుడ్ మీద ఉన్న మోజుతో.. వీళ్లకు ఇంత సక్సెస్ ని ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ కి దూరం అయ్యి.. చివరకి నష్టపోతారేమో అని అంటున్నారు..