Samantha and Naga Chaitanya : నాగచైతన్య సమంత ఈ జంట ఎప్పటికప్పుడు అందరి నోట్లో వినిపిస్తూనే ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీళ్ళ ప్రయాణం ప్రేమగా మారి.. 7, 8 సంవత్సరాలు ( Samantha and Naga Chaitanya doing ) ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి ఏదో సాదాసీదాగా జరగలేదు. అభిమానులందరూ ప్రతి ఈవెంట్ ని ఆనందంగా షేర్లు చేస్తూ వైభవంగా జరిగింది. అయితే ప్రేమించుకోవడానికి ఇన్నేళ్లు ఒకరికొకరు నచ్చిన వీళ్ళకి.. పెళ్లి తర్వాత కనీసం అందులో సగం నాలుగేళ్లు కూడా ఒకరితో ఒకరు ఉండలేకపోవడం నిజంగా దురదృష్టకరం. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఏం మాయ చేసావ్, ఆటో సూర్య, మనం, మజిలీ వీటిలో మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
అంటే ఈ జంట అంత చూడ చక్కని జంటని సినిమా పరంగా కూడా నిరూపించుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఉండగా వీళ్ళిద్దరి కెరియర్ కూడా బాగుంది. సమంతది అయితే సూపర్ హైలెట్ కెరియర్ అనుకోండి.. నాగచైతన్య కూడా కొన్ని హిట్స్, కొన్ని యావరేజ్ లు, కొన్ని ప్లాప్స్ తో అలా యావరేజ్ కెరియర్ ని చక్కగా నడిపించాడు. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విడిపోయారో.. అటు సమంతకి, ఇటు నాగచైతన్యకి కూడా ( Samantha and Naga Chaitanya doing ) ఏదో దోషం పట్టినట్టుగా.. ఎంత ప్రయతించిన సక్సెస్ ని అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు ఏకమైపోయి.. ఇంకా సినీ అభిమానుల్లో ఎంతోమందికి ఈ జంట అంటే ఇష్టం ఉండటం వలన సినిమాలు పెద్ద హిట్స్ కొట్టేవి.
ఎప్పుడైతే సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయారో.. అప్పుడే సమంత నాగచైతన్య అభిమానులు కూడా చీలిక అయిపోయారు. దానివల్ల ఒకరి సినిమాల్లో.. ఇంకొకరి అభిమానులు నెగిటివ్ ఎంచడంతోనే సినిమాలు చాలావరకు ఫ్లాప్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే సమంత నాగచైతన్య కొన్ని విషయాల్లో ఒకేలా ఆలోచిస్తారంట. ఒకేలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా విడిపోక ముందే కాదు.. ఇప్పటికీ విడాకులు ( Samantha and Naga Chaitanya doing ) తీసుకున్నా కూడా వీళ్ళిద్దరూ ఆ విషయంలో ఒకలాగే ఆలోచించి.. ఒకే ఇష్టంతో, ఒకే నిర్ణయాలతో, ఒకేలా బిహేవ్ చేస్తారట. ఇంతకీ వాళ్ళిద్దరూ ఆలోచనలు ఒకేలా ఉండే ఆలోచనలు ఏమిటో? వాటి ఆచరణ ఏమిటో? తెలుసుకుందాం.
సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఏదైనా సినిమా కథ వింటే ఆ సినిమా వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నచ్చితే.. రెమ్యునిరేషన్ తక్కువైనా కూడా ఒప్పుకుంటారంట. ఈ విషయంలో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారంట. ఇద్దరూ ఎవరి సినిమాలకి వాళ్ళు అలాగే నిర్ణయం తీసుకుంటారు అంట. అలాగే సినిమా ఫ్లాప్ అయితే, నిర్మాతలు నష్టపోతే.. వాళ్ళు తీసుకున్న రెమ్యునిరేషన్ కూడా కొంత భాగం తిరిగి ఇచ్చేస్తారు అంట. ఈ విషయంలో కూడా వీళ్ళిద్దరి ఆలోచన ఒకలానే ఉండి ఒకేలా ఆచరిస్తారు అంట. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఆ విషయాల్లో మాత్రం ఒకే రకంగా ఆలోచించి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇన్ని రకాలుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉండే ఈ జంటకి ఎవరి దోషం పట్టిందో? ఏం జరిగిందో? తెలియదు గానీ విడిపోవడం మాత్రం బాధాకరమే.