Samantha: అతి తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతటి పాపులాటీ తన సొంతం చేసుకుందో అలాంటి సమంత గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇంక సమంత ప్రస్తుతం ఎలాంటి క్రేజీ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సమంత గురించి వారానికి ఓ రెండు నుండి మూడు వార్తలు ఏదో ఒక మూల నుండి ఏదో ఒక రకంగా వ్యాపిస్తునే ఉంటాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు లేదా వెబ్ మీడియాలో వైరల్ కావచ్చు లేదా సినీ ఇండస్ట్రీలో లో కూడా ఆమె గురించి ఎన్నో రకాల వార్తలు చెక్కర్లు కొడుతూనే ఉంటాయి. (Samantha After Many Days)
అలా వైరల్ అవుతున్న వార్తలతో ఇటీవలి మధ్య కాలంలో సమంత పేరు నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. దానికి ముఖ్య కారణం ఇటీవలే ఆమె నటించిన చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న శకుంతలం సినిమా అని తెలుస్తుంది. కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తున్నది. ఇక ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనుండగా సెప్టెంబర్ ఒకటో తారీఖున గ్రాండ్ గా థియేటర్లలోకి ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇంకా ఇదే కాకుండా సమంత బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సిటాడేల్ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ జరుగుతుంది. కాగా ఇలాంటి క్రమంలో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో బ్రేక్ రావడంతో సమంత తన ఫ్యామిలీతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలం తర్వాత సమంత వారి కుటుంబ సభ్యులతో మరియు తన తల్లి గారితో డిన్నర్ కు వెళ్ళింది. అందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా సమంత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. దాంతో క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. (Samantha After Many Days)
ఇక ఈ ఫోటోలో సమంత చాలా సంతోషంగా చిల్ అవుట్ అవుతూ మోడ్రన్ డ్రెస్ లో మంచి లుక్ ఇచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ని అన్నింటిని సంతోషంగా లాగించేస్తుంది. ఇక ఇదే కాకుండా తన సోషల్ మీడియాలో షూటింగ్ కి విరామం రావడంతో రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఓ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలన్నీ వైరల్ గా మారాయి. ఇదే కాకుండా సమంత అభిమానులు కూడా సమంతలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా సంతోష పడుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో సమంత పేరు ఏ విధంగా మార్మోగిపోతుందో చెప్పనక్కర్లేదు.