Sam Samantha: అది తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ గత ఏడాదిన్నర నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వస్తుంది సమంత. అక్కినేని నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్న అనంతరం.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన తను, మానసిక సంఘర్షణను తట్టుకోలేని తను, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.. చాలా నెలల పాటు ఆమె ఇంట్లోనే ఉంటూనే ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంది. ఈ వ్యాధి నుంచి కోల్కున్న తర్వాత ఆమె మొట్ట మొదటిసారిగా శాకుంతలం చిత్రం ఈవెంట్లో పాల్గొన్నది.
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో (Sam Samantha) సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా కలిసి నటించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రికార్డు బద్దలు కొట్టలేకపోయింది. ప్రస్తుతానికి అయితే సామ్.. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిరీస్ సిడాటెల్ లో మరదే విధంగా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన సమంత ఖుషి చిత్రంలో నటించనున్నది. ఇక ఇటీవల సమంత సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా అమెరికాలో సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఇక సమంత ఇప్పటికీ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూనే ఉన్నది.
ఇక ఈ సమస్య నుంచి గట్టెందుకు ఆమె ఇంకా చికిత్స తీసుకుంటుంది. సమంత ఇంకా మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా బయటకు రాలేదు. ఈ చికిత్స వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినది కావున ఎక్కువ కాలం చికిత్స పొందుతూనే ఉండాల్సిన పరిస్థితి అవసరం పడుతుందట. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న చికిత్స హైపర్ బారిక్ తెరపి.. ఈ వ్యాధికి సంబంధించి సమంత తీసుకుంటున్న చికిత్స గురించి స్వయంగా ఆమె తన సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది. ఇక సమంత ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉండడంతో అభిమానులు అయోమయంతో ఆందోళనకు గురి చెందుతున్నారు. సమంత తీసుకునే చికిత్స గురించి స్వయంగా ఆమె తెలిపారు. మయోసైటిస్ వ్యాధిలో శరీరమంతా నొప్పులతో పాటు కండరాల నొప్పులు ఉంటాయి.
దానికోసం సమంత శరీరంలో ఇన్ఫ్లమేషన్ పోవడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి వీలుగా హైపర్ బారిక్ థెరపీ చేయించుకుంటుంది. ఈ చికిత్సలో దెబ్బతిన్న కణజాలం పూర్తిగా కోలుకుంటుంది. నిర్ణీత ప్రెజర్ తో అవసరమైన ఆక్సిజన్ ను తీసుకోవడమే హైపర్ బారిక్ తెరపి. ఇక ఇందులో సాధారణ వాయు పీడనం తో మనం తీసుకునే ఆక్సిజన్ కంటే ఎక్కువ పీడనంతో ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులకు అందుతుంది. ఫలితంగా ఆక్సిజన్ బ్యాక్టీరియా పై పోరాటం చెయ్యడంలో సహాయపడుతుంది. ఇలా ఈ సమస్య నుంచి త్వరగా మరియు పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నది.