Slaman Khan Marriage: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు పొందిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో అందరూ ఎదురుచూస్తున్న విషయం తెలిసినదే. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో మాత్రమే కాదు, యావత్ భారతదేశం మరియు అనేక దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా సల్మాన్ కి అభిమానులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ వస్తాయి. అంత పెద్ద స్టార్ ఇంతవరకు పెళ్లి (Salman Khan will be marry with that heroine) మాటకు వెళ్ళకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని ఇవ్వడమే కాకుండా, సల్మాన్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు ఆయన ఫ్యాన్స్. అయితే అసలు సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్ళికి రెడీ అవుతాడు? ఎవర్ని ఏచేసుకుంటాడు? ఎలాంటి అమ్మాయి మన కండల వీరుడికి నచ్చుతాది ఇలా ఎన్నో సందేహాలు సినీ అభిమానుల మనస్సులో ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా కిసీ క భాయ్ కిసీ క జాన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో పూజ హగ్దే, భూమిక, వెంకటేష్ నటిస్తున్నారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 4 విడుదలకు సిద్ధంగా ఉంది. ‘వీరమ్’ అనే తమిళ్ సినిమాను తీసుకుని, సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమాని తీస్తున్నారు. ఫర్హాద్ సమ్‌జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సమ్మర్ లో కిసీ క భాయ్ కిసీ క జాన్ అనే ఈ సినిమా చాలా హడావిడి చేస్తాదని, భారీ కలెక్షన్స్ తెస్తాదని భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలను ఎంతవరకు ఈ సినిమా రీచ్ అవుతాది అనేది రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే.. సల్మాన్ ఖాన్ ( Salman Khan will be marry with that heroine ) పెళ్లి చేసుకోబోతున్నాడని. ఇంతకీ ఈ ప్రచారం ఎలా మొదలయ్యిందంటే..
సల్మాన్ ఖాన్ పూజ హగ్దే కలిసి కిసీ క భాయ్ కిసీ క జాన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పూజ హగ్దే పెరఫామెన్స్ బాగా నచ్చి, మెచ్చుకోవడమే కాకూండా సల్మాన్ ఖాన్ 10 కోట్లు విలువచేసే కార్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఈ న్యూస్ ఇపుడు బాగా వైరల్ అవుతుంది. ఇంతవరకు ఏ హీరోయిన్ కి అంత గిఫ్ట్ ఇవ్వని సల్మాన్ ఖాన్ ఎందుకు ఇప్పుడు పూజ హగ్దే కి అంత గిఫ్ట్ ఇచ్చాడని నెటిజనులు డిస్కస్ చెయ్యడం మొదలు పెట్టారు. వీరిద్దరికీ ఎదో ఉందని కొందరు, వీరిద్దరూ లవ్ లో ఉండి ఉంటారని మరికొందరూ అనుకుంటున్నారు. అంతే కాదు, సల్మాన్ ఖాన్ పూజ హగ్దే కి అంత విలువైన గిఫ్ట్ ఇచ్చాడంటే కహ్చితంగా ప్రేమలో ఉన్నాడని, త్వరలో ఆమెనే పెళ్లి కూడా చేసుకుంటాడని అనుకుంటున్నారు.
అసలు సల్మాన్ నిజంగా కొన్నాడో లేదో ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం అలా వార్తలు క్రియేట్ చేస్తున్నారో తెలీదు కానీ అభిమానులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతకాలం సల్మాన్ ఖాన్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే సందేహం నుంచి, పూజ హగ్దే ని చేసుకుంటాడు అంటే జోడీ సూపర్ అంటూ సల్మాన్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ఇవన్నీ జరిగే పనులో కాదో తెలీదు కానీ, ఈ కార్ గిఫ్ట్ న్యూస్ వలన సల్మాన్ పెళ్లి కబుర్లు మాత్రం కొన్ని రోజులు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వక తప్పేలా లేదు..