సినిమా : కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ( Kisi Ka Bhai Kisi Ki Jaan ) ( Salman khan latest movie review )
నటీనటులు: సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే, జగపతి బాబు, జాస్సీ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, ఇతరులు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
కెమెరా: వి.మణికందన్
ఎడిటర్: మయూరేష్ సావంత్
నిర్మాత: సల్మాన్ ఖాన్
దర్శకత్వం: ఫర్హాద్ సామ్జీ
విడుదల: 21 ఏప్రిల్ 2023 ( Kisi Ka Bhai Kisi Ki Jaan movie release date ) ( Kisi Ka Bhai Kisi Ki Jaan Review and Rating )
సల్మాన్ ఖాన్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా ఫర్హాద్ సామ్జీ దర్శకతంలో రూపుదిద్దుకున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఏప్రిల్ 21 శుక్రవారం ఈద్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో స్పెషల్ ఏమిటంటే.. టాలీవుడ్ నటులు ఎక్కువగా నటించారు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. 200 కోట్ల పై బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఎలా ఉందొ కథలోకి వెళ్లి చూద్దాం..
కథ..
భాయిజాన్ ( సల్మాన్ ఖాన్ ) ముగ్గురు తమ్ముళ్లకు అన్న. తన తమ్ముళ్లు ముగ్గురూ మోహ్ (జాస్సీ గిల్), లవ్ (సిద్ధార్థ్ నిగమ్) మరియు ఇష్క్ (రాఘవ్ జుయల్) అంటే తనకి ప్రాణం. తాను పెళ్లి చేసుకుంటే.. తన జీవితంలోకి వచ్చిన ఆడది తన తమ్ముళ్లను తన నుంచి దూరం చేస్తాదేమోనేనే భయంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ముగ్గురు తమ్ముళ్లు కూడా ప్రేమలో పడతారు గాని, వాళ్ళ భాయిజాన్ కి చెప్పడానికి భయపడతారు. ఇలాంటి సమయంలో భాగ్య లక్ష్మి గుండమనేని (పూజా హెగ్డే) హైదరాబాద్ నుంచి వచ్చి సల్మాన్ ఇంట్లో అద్దెకి దిగుతాది. భాగ్య లక్ష్మి పెళ్లి అనేది కుటుంబంలో ఎంత అవసరమో భాయీజాన్ కి తెలియజేస్తూ..భాయీజాన్ ప్రేమలో పడతాది. అలాగే హైదరాబాద్ లో ( Salman khan latest movie review ) భాగ్య లక్ష్మి అన్న ( వెంకటేష్ ) ఎంత మంచివాడో చెబుతాది. భాగ్యలక్ష్మి ని కొందరు చంపాలని చూస్తున్నారని భాయీజాన్ కనిబెట్టి.. ఆమెతో పాటు వాళ్ళ అన్నని కలవడానికి ఆ ఊరు వెళ్తాడు. అసలు భాగ్యలక్ష్మిని గూండాలు ఎందుకు చంపాలని అనుకుంటారు? భాగ్యలక్ష్మి అన్న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? భాయిజాన్ అక్కడికి వెళ్లి ఏం చేస్తాడు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాని రీమేక్ చేసారు. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశారు. వీరం ఆధారంగా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు కూడ తీశారు గాని, అది ఫ్లాప్ అయ్యింది. తమిళ్ లో తప్ప తెలుగు కన్నడంలో ఫ్లాప్ అయిన ఈ సినిమా కథని పైగా 2014 లో వచ్చిన వీరం సినిమాని ఇప్పుడు 2023 లో తీశారంటే.. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు దర్శకుడు, హీరో, నిర్మాత ఒక్కసారైనా బాగా అలోచించి ఉంటారా అనిపించింది. సినిమా మొదలు నుంచి ముగిసేవరకు సినిమా ఎప్పుడు అయిపోతే ఇంటికి పోదామా అనిపించేలా ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం దేవదాసు సినిమాని షారూక్ ఖాన్ ని పెట్టి తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా హిస్టరీ కూడా ఉంది కానీ, ఈ సినిమాని మాత్రం తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటన బాగానే ఉంది. కానీ ఆయన స్టార్ డమ్ కి తగ్గ పాత్ర మాత్రం కాదు. ఉన్నంత వరకు ఎప్పటిలానే తన స్టయిల్ లో తాను బాగానే నటించాడు. అలాగే తెలుగు వాళ్ళతో కలిసి, వాళ్ళ సెంటిమెంట్స్, మాస్ ని అట్రాక్ట్ చేసుకునేలా నటించడానికి బాగా ట్రై చేసాడు. ఇక ఈ సినిమాలో పూజ హగ్దే బాగానే నటించింది. ఫస్ట్ ఆఫ్ ఆమె పాత్ర, నటన, సల్మాన్ ఖాన్ ( Salman khan latest movie review ) లాంటి హీరో పక్కన చేస్తున్నాననే భయం అలాంటిది ఏమి లేకుండా చక్కగా నటించింది. ఫస్ట్ ఆఫ్ సినిమా అంతా సల్మాన్, పూజ హగ్దే లతో కొన్ని ఫైట్స్ తో సినిమానేదో అలా బోర్ కొట్టిస్తూ లాగారు. సినిమా కథ తెలిసినదే అయినా, ఆడియన్స్ చూడాలి అంటే.. ఆ సినిమాలో కథ పాతదైనా ప్రతీ సీన్ లో కొత్తదనం మనసును హత్తుకునే స్క్రీన్ ప్లే ఉంటె చూడగలరు గాని.. ఇలా చూడాలంటె పనిష్మెంట్ లా అనిపిస్తాది.
ఇకపోతే సెకండ్ ఆఫ్ వచ్చేటప్పటికి కథలో కొంత మార్పు చేసి.. వెంకటేష్ పాత్రకి కొన్ని మెరుగులు దిద్దారు. ఈ సినిమాలో వెంకటేష్ తన పాత్రను తాను బాగానే నటించాడు. కాకపోతే ఒకొక్కసారి సినిమా మూల కథ, కథకి హీరో వెంకటేష్ నా? లేక సల్మాన్ ఖాన్ నా ? అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. మాములుగా మన టాలీవుడ్ హీరోస్ దగ్గరే ఎంతో గంబీరంగా, పవర్ఫుల్ విలన్ లా నటించే జగపతిబాబు ( Salman khan latest movie review ) ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ టైగర్ దగ్గర చాలా సిల్లీ విలన్ లా నటించాడు. పాపం ఇందులో జగపతిబాబు తప్పేమి లేదు కానీ, ఆ పాత్రని ఆలా డిజైన్ చేసిన దర్శకుడి అంచనా సెట్ అవ్వలేదు. సెకండ్ ఆఫ్ లో కూడా ప్రతీ సీన్ చాల సాగుతున్నట్టు అనిపించింది. హిందీ సినిమాలో ఎక్కువమంది తెలుగు నటులు, తెలుగు భాష మాత్రమే కాకుండా తెలుగు పాట కూడా ఉంది కాబట్టి మన తెలుగువాళ్లు హ్యాపీ అవ్వచ్చు.
ట్రైన్ లో ఫైట్ బాగుంది. అలాగే లుంగీ డాన్స్ తెలుగు మాస్ ఆడియన్స్ని తప్పకుండా అట్రాక్ట్ చేసే విధంగా బాగుంది. దీనిలో రామ్ చరణ్ ఎంట్రీ కొంత ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ ని బాగా అదరగొట్టాలని ట్రై చేసారు గాని, తేలిపోయినట్టు అయిపోయాయి. ఇక చివరి స్టేజి కి వచ్చేసరికి సినిమాలో హీరో ఎవరు సల్మాన్ నా వెంకటేష్ నా అని సల్మాన్ అభిమానులకు కోపం వస్తాద ని అనుకున్నారో ఏమో గాని, చివరిలో నేను ఊరుకుంటా.. మిగిలిన టైం అంతా నువ్వు ఫైట్ చెయ్యని వెంకటేష్ సల్మాన్ కి చెప్పినట్టు అనిపించింది. సల్మాన్ ఖాన్ ఏజ్ ఈ సినిమాలో బాగా కనిపించింది. సల్మాన్ ఖాన్ సినిమాలో మన టాలీవుడ్ నటులు నటించినట్టు అనిపించలేదు. మన టాలీవుడ్ సినిమాలో సల్మాన్ ఖాన్ వచ్చి నటించినట్టు అనిపించింది. పోనీ అలాగైనా కూడా మన తెలుగు ( Salman khan latest movie review ) వాళ్లకు కూడా ఈ సినిమా ఎంతవరకు ఎక్కుతాదో చెప్పలేం. పాత సినిమాలు అప్పట్లో వీసిఆర్ తో టీవీ లో చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాకి హీరో గా ఒప్పుకోవడమే గ్రేట్ అనుకుంటే.. దీనిని నిర్మించడం ఇంకా గ్రేట్ అనిపిస్తుంది. అయితే సెలవులు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సినిమా చూడగలరు. ఏది ఏమైనా సినిమా బిలో యావరేజ్ అని చెప్పచు..
రేటింగ్ : 2/5
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడి కోణం మాత్రమే.
అసలైన రివ్యూ మీకు మీరే ఇవ్వాలి..