Home Cinema Sai Dharam Tej: తన పెళ్ళి పై సంచలనమైన కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej: తన పెళ్ళి పై సంచలనమైన కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్.

SaiDharamTej: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరు ఇటీవల పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతున్నారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని గడుపుతూ ఆ లైఫ్ ని వదలకుండా వాళ్ల కెరియర్ ను కొనసాగిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. మరి అలాంటి హీరోలలో ఒక హీరో మెగా హీరో అయినటువంటి సాయి ధరం తేజ్ కూడా వీలందరిలో ఒకడు. ఈయన పెళ్లి వార్తల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో వార్తలైతే వైరల్ అవుతూనే ఉన్నాయి.

bro-saidharamtej-makes-sensational-statements-regarding-his-marriage

ఇప్పుడు మరొక సారి ప్రేక్షకులందరికీ ముందే ఆయన అభిమానులు సైతం తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ ఏకంగా ఆయననే ప్రశ్నించడం గమ్మత్తైన విషయం. మరి ఆ విషయం ఏంటనే అని వివరాల్లోకి వెళ్లినట్లయితే.. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బ్రో. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఈ చిత్రం ఈనెల 28వ తారీకున విడుదల కానున్న సందర్భంగా భారీ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్ లు చేస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం.

See also  Venu Swamy : వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి గురించి సంచలనమైన వార్త చెప్పిన వేణుస్వామి!

bro-saidharamtej-makes-sensational-statements-regarding-his-marriage

అయితే ఇటీవలే శనివారం తిరుపతిలో జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమం లో భాగంగా ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకను జరపగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను సాయి ధరం తేజ్ ప్రస్తావించారు. ఇక నాకు ఈ చిత్రంలో నా గురువు అయిన పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అటూ తెలుపగా.. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడం వల్లనే ఈ చిత్రంలో భాగమయ్యారని తెలిపారు. అలా సరదాగా ప్రేక్షకులతో అభిమానులతో ముచ్చటించిన సాయి ధరం తేజ్ వాళ్ళు అడిగే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలుపుతూ వచ్చాడు.

See also  Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

bro-saidharamtej-makes-sensational-statements-regarding-his-marriage

ఇక పలు ప్రశ్నలు అడిగే భాగంలో ఓ వ్యక్తి మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అని సాయి ధరమ్ తేజ్ ని ప్రశ్నించడంతో.. సాయి ధరమ్ తేజ్ అందుకు సమాధానంగా ఇంకెక్కడి పెళ్లి (SaiDharamTej) బ్రో ఈ సినిమా ఎప్పుడైతే మొదలైందో టైటిల్ ని పట్టుకొని ప్రతి ఒక్కరు నన్ను కూడా బ్రో అని పిలవడం మొదలెట్టేశారు. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ వెలుబడక ముందు ఎవరో ఒకరు నన్ను ట్రై చేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి బ్రో అని టైటిల్ పెట్టారో అప్పటి నుంచి నన్ను అందరూ బ్రో అని పిలవడం మొదలు పెట్టారంటూ అక్కడ అందరి చేత నవ్వుల పువ్వులు పూయించాడు సాయిధరమ్ తేజ్.. దాంతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి మరొకసారి నెట్టింట చేసిన ఈ కామెంట్లు వైరల్ గా అవుతున్నాయి.