Ram Charan – Sai Pallavi : సాయి పల్లవి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టం. చాలా సాధారణమైన నటనతో మేకప్ అనేది ఎక్కువ లేకుండా ఎక్కువ ఎక్స్పోజింగ్ కూడా లేకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి.. పాత్రకు ( Ram Charan and Sai Pallavi ) ఇంకా ప్రాముఖ్యతను ఇచ్చి తనను తాను ఒక మంచి స్థానంలో నిలబెట్టుకున్న హీరోయిన్ అంటే.. సాయి పల్లవి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. సాయి పల్లవి ఫిదా సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించి.. అందరి హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించేసుకుంది. ఫిదా సినిమాతో ఆమెకు కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత కొంతకాలం సినిమా నటించి కొన్ని రోజులుగా ఆమె సినిమాలకి దూరంగా ఉంది. అయితే ఆ దూరానికి కారణం కూడా తనకు నచ్చిన పాత్రలు దొరకకపోవడమే అని చాలామంది చెప్పారు.సాయి పల్లవి తన పాత్రకు చాలా ( Ram Charan and Sai Pallavi ) ప్రాముఖ్యతను ఇస్తుంది. ఏదో ఒక సినిమా దొరికింది చాల్లే.. అని ఏదిబడితే అది చేయదు. ఆమెకు పాత్ర చాలా నచ్చాలి. అప్పుడే ఆమె చేస్తుంది అని ఆమె మీద ముద్ర ఉంది. దీంతో సాయి పల్లవికి చాలా పొగరుని కూడా చాలామంది కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా నటించే వాళ్లకి వాళ్ల పాత్ర నచ్చాలి.. అప్పుడే వాళ్ళు అంత అద్భుతంగా నటించగలరు అన్న విషయం సగటు ప్రేక్షకుడికి తెలుసు.
ఇంత కాలానికి సాయి పల్లవి మళ్లీ మరొక మెగా హీరో తో కలసి నటించబోతుందని అభిమానులు అందరూ ఆనందంలో ఉన్నారు. ఇంతకీ ఆ మరో మెగా హీరో ఎవరు అంటే.. ఎవరో కాదు మన రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan and Sai Pallavi ) పక్కన సాయి పల్లకి నటించే అవకాశం దక్కింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఇంతవరకు అఫీషియల్ గా ఎక్కడ చిత్ర బృందం వాళ్ళు చెప్పలేదు కానీ.. రామ్ చరణ్ సరసన సాయి పల్లవి నటిస్తుంది అంటూ వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు రాంచరణ్ ఏ సినిమాలో సాయి పల్లవి నటించినబోతుంది అంటే.. రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు మనందరికీ తెలిసిందే.
అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని డిసైడ్ అయ్యారంట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి జాన్వి కపూర్ గానీ మృణాల్ ఠాకూర్ గాని అలాంటి గ్లామరస్ హీరోయిన్స్ తీసుకోవాలని అనుకున్నారంట. కానీ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా డెప్త్ గా ఉంటుందని, ఆ పాత్ర సాయి పల్లవి అయితే చాలా బాగా చేస్తుందని.. సాయి పల్లవి అయినటువంటి పాత్రలో పెడితే.. సినిమాకి హైప్ వస్తుందని ఆలోచించి దర్శకుడు సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నాడు అంట. ఈ వార్తలో ఎంత నుంచి వరకు నిజముంది అనేది అఫీషియల్ గా బయటికి వచ్చేవరకు తెలియదు కానీ.. మొత్తానికి రామ్ చరణ్, సాయి పల్లవి కలిసి పాపం జాన్వికపూర్, మృణాల్ ఠాకూర్ లను పక్కకు తోసేసారన్నమాట అని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సాయి పల్లవి రెండు తమిళ చిత్రాలు చేస్తూ ఉండగా.. ఇంకా నాగచైతన్యతో కలిసి తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.