Sai Pallavi Rejected: చాలామంది హీరోయిన్లు సినిమాలో నటించే అవకాశం వచ్చి ఫస్ట్ స్టోరీ వినక ముందే వాళ్ళ ఎక్ష్పెక్ట్ చేసేది ఏంటంటే మొదట రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత స్టోరీ ఎలాంటిదైనా చేసేద్దామని అనుకుంటారు. కానీ అందరి హీరోయిన్లు అలా అని కాదు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలామంది హీరోయిన్ లు ఇచ్చేది మాత్రం రెమ్యూనరేషన్ గురించే.. కానీ నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం. ఆమె మొదట కథలో తన క్యారెక్టర్ ఎంత అని వెతుక్కుని దానికి ప్రాధాన్యత ఉందా? లేదా? అంటూ చూసుకుంటుంది. అసలు ఆ పాత్ర నాకు సెట్ అవుతుందా అవ్వదా.. ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.
నేను ఆ పాత్రలో నటిస్తే అలాంటి లెక్కలు వేసుకుంటుందట.. అందువల్లే ఇప్పటి వరకు సాయి పల్లవి కెరియర్లో చేసిన ప్రతి చిత్రానికి చాలా మంచి గుర్తింపు లభించింది. మొదట తన ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చేది పాత్ర ఓకే అయితేనే ఒకవేళ తనకు ఆ పాత్ర నచ్చకుంటే ఎంత పెద్ద హీరో అయినా ఎంత రెమ్యూనరేషన్ అయినా సరే ఇట్టే రిజెక్ట్ చేసి పడేస్తుందట.. అలా సాయి పల్లవి గతంలో ఎన్నో చిత్రాలు సైతం వదులుకున్నది. అదే లిస్టులోకి ఆ మధ్య విడుదలైన బ్లాక్ పాస్టర్ హిట్ చిత్రం నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమా కూడా ఉంది. మరి ఆ చిత్రం ఏమనుకుంటున్నారు.? గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ హీరో గా కనిపించాడు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ల శృతిహాసన్, హనీ రోజ్ లు నటించగా.. విలక్షణ నాటి వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య బాబు చెల్లెలి పాత్రలో నటించింది. చెల్లెలి సెంటిమెంట్ కదా నేపద్యంలో రూపు దిక్కున ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా చాలామందికి అస్సలు తెలియని విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో వరలక్ష్మి పోషించిన బాలయ్యకు చెల్లెలి పాత్ర కోసం మొదట సాయి పల్లవి నే అనుకున్నారట.. కానీ ఈ చిత్రంలో సిస్టర్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ.. సాయి పల్లవి మాత్రం రిజెక్ట్ చేసిందట.
ఇటువంటి నెగటివ్ స్టేట్స్ నాకు క్యారెక్టర్ తనకు అసలు సెట్ అవ్వవు అని భావించే ఆమె వద్దనుకుందట. దాంతో ఎవరా అని ఆలోచిస్తుండగా అప్పుడప్పుడే మంచి ఫామ్ లో విలన్ క్యారెక్టర్లతో మెరిపిస్తున్న వరలక్ష్మి నీ తీసుకున్నారట. దీంతో ఈ చిత్రంలో ఆమె నటన విశ్వరూపం చూపించడమే కాకుండా బాలయ్యకు దీటుగా సమానంగా మెప్పించింది అని చెప్పాలి. ఏదేమైనా అసలు ఈ క్యారెక్టర్ సాయి పల్లవి వదులుకొని చాలా మంచి పని చేసింది. ఒకవేళ చేసుంటే మాత్రం కచ్చితంగా ఆమె పరువు పోయేదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఇంత వరకు ఆమె చేయలేదు. అసలు ఆమెకి సూట్ కావు కూడా అందుకోసమే చాలా సున్నితంగా (Sai Pallavi Rejected) విరసింహారెడ్డిని వదిలేసుకుంది.