Home Cinema Sai Pallavi: చెల్లి పెళ్లి లో అదిరిపోయే డాన్సుతో దుమ్ము రేపిన సాయి పల్లవి..

Sai Pallavi: చెల్లి పెళ్లి లో అదిరిపోయే డాన్సుతో దుమ్ము రేపిన సాయి పల్లవి..

sai-pallavi-energetic-dance-in-her-sister-marriage

సౌత్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఈమె మిగిలిన హీరోయిన్స్ లాగ ముఖం నిండా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాదు. తనకి ఉన్న నేచురల్ బ్యూటీ ని చూపిస్తూ అశేష ప్రేక్షకాభిమానం ని పొందింది. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ అనే డ్యాన్స్ షో(Sai Pallavi Dance) ద్వారా ఈమె తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ షో బాగా హిట్ అవ్వడం తో సాయి పల్లవి మలయాళం మేకర్స్ దృష్టిలో పడింది. అక్కడ ఈమెకి ‘ప్రేమమ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికింది.

See also  Rajamouli - Allu Arjun : మహేష్ తరవాత అల్లు అర్జున్ తో రాజమౌళి అంత గొప్ప సినిమా తీస్తాడా?

ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకి అవకాశాలు క్యూలు కట్టాయి, తెలుగు లో శేఖర్ కమ్ముల ఈమెని ఫిదా సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఈ సినిమా ద్వారానే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేసులోకి అడుగుపెట్టింది. వరుస పెట్టి సినిమాలు చేసింది. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఈమె ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేదు, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది.

హద్దులు మీరు రొమాన్స్ చెయ్యకూడదు అని, అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం తావు ఇవ్వకూడదని ఆమె బలమైన గీత తన చుట్టూ గీసుకుంది. ఆ గీతని దాటి ఆమె ఇప్పటి వరకు బయటకి రాలేదు, భవిష్యత్తులో రాదు కూడా. అయితే రీసెంట్ గా ఆమె తన చెల్లి పూజా పెళ్ళిలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్ గా పూజ వినీత్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకోగా, గురువారం రోజు ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్ళికి ముందు హాల్దీ, మెహందీ మరియు సంగీత్ ఫంక్షన్స్ లో సాయి పల్లవి తన చెల్లి పూజా తో కలిసి వేసిన చిందులకు అందరూ ఆశ్చర్యపోయారు.

స్వతహాగా అక్కాచెల్లి ఇద్దరు మంచి డ్యాన్సర్లు(Sai Pallavi Dance) అవడంతో తెలుగు, తమిళం మరియు మలయాళం పాటలకు దుమ్ము లేచిపోయే రేంజ్ లో డ్యాన్స్ వేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య తో తండేల్ చిత్రం చేస్తుండగా, హిందీ రామాయణం లో సీత పాత్రలో నటించబోతుంది.