ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం మెగా ఫ్యామిలీ పై నెట్టింట ఏ విధంగా రచ్చ జరుగుతుందో.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పట్టుకొని వేలాడుతూ వాటిని ఆ విషయాలను ట్రోల్ చేయడం విపరీతంగా సోషల్ మీడియాలో మారిపోయింది. చిన్న విషయాన్ని ట్రోల్ చేసే తెగ శునకానందం పొందుతున్నారు పలుగురు ఆకతాయిలు. ఇక ఇలాంటి ట్రోల్స్ విపరీతంగా పెరగడానికి ముఖ్యమైన కారణం.. ఎప్పుడైతే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుందో అప్పటి.నుంచి నెట్టింట ఆమె పై విపరీతమైన ట్రోల్స్ కు గురి చేయడమే కాకుండా మెగా ఫ్యామిలీని సైతం ఇందులోకి లాగుతూ విమర్శల పాలు చేస్తూ మెగా కుటుంబం పై నిందలు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. (Sai Dharam Tej Wars)
నిహారిక ఏదైనా మంచి పని చేసి అందుకు సంబంధించిన ఫొటోస్ ఏదైనా ఇన్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన దాని పై విపరీతమైన బూతులు పెడుతూ వల్గర్ కామెంట్స్ చేయడం.. పోస్ట్ చేయకపోయినా సరే ఆమె ను ట్యాగ్ చేసి మరి ఆమె పై కామెంట్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నిహారిక పెట్టిన ఓ కామెంట్ పై టార్గెట్ చేస్తూ ఓ నేటిజన్ ఆమె పర్సనల్ లైఫ్ ని టచ్ చేసే విధంగా కామెంట్ రాయసాగాడు. అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తన స్నేహితుడైనటువంటి సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కోసం ఓ ప్రైవేట్ పాటలో నటించసాగాడు. ఇక ఈ ప్రైవేట్ ఆల్బమ్ లో కలర్స్ స్వాతి తో కలిసి సత్య అనే సాంగ్ లో నటించి ఎంతగానో అలరించి అందర్నీ మెప్పించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట దూసుకుపోతూ ట్రెండింగ్ మారిపోయింది.
ట్రెండింగ్ గా మారిపోతూ సంచలనాలను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ అప్డేట్ సాయి తరమ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ పై నిహారిక రిప్లై ఇస్తూ ఈ సాంగ్ చూడ్డానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ కామెంట్ చేసింది. అయితే సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ కి నిహారిక ఇచ్చిన రిప్లై కి ఆ నెటిజన్ అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం అక్కడ లేనే లేదు. కానీ కావాలనే టార్గెట్ చేసే విధంగా నిహారిక యొక్క పర్సనల్ లైఫ్ ని కావాలని మధ్యలోకి లాక్కొచ్చి మరి ఆమెను ఇబ్బందుల పాలు చేయడం.. మరి ఆ కామెంట్ ‘ఏంటంటే ఇలాంటి వాటి పై దృష్టి పెట్టే బదులు మీ కుటుంబంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అంటూ ఆ నెటీజన్ నిహారిక వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించగా..
దానికి సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Wars) తీవ్రమైన కోపంతో వెంటనే స్పందిస్తూ ఆ కామెంట్ కి రియాక్ట్ అవుతూ నోరు మూసుకొని వెంటనే కామెంట్ డిలీట్ చెయ్ అంటూ ఆ కామెంట్ కి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు. దాంతో సాయి ధరం తేజ్ ఫాన్స్ కూడా సదరు నెటిజెన్ ను విమర్శలతో ముంచేత్తుతూ అతని పై విరుచుకుపడ్డారు. ఎందుకు ప్రతి విషయంలో నిహారికనే టార్గెట్ చేసి మీరు ట్రోల్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేయ సాగారు. పలువురు సంస్కారం లేని మనుషులు ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారు అంటూ రకరకాల కామెంట్ చేయడంతో ఒక్క సారిగా నెట్టింట ఇంకా ఈ విషయం వైరల్ అయింది.