Home Cinema Sai Dharam Tej: నాకెప్పుడో పెళ్ళయిపోయిందంటూ.. మెగా ఫ్యామిలీ కి షాకిచ్చి సాయిధర్మతేజ్!

Sai Dharam Tej: నాకెప్పుడో పెళ్ళయిపోయిందంటూ.. మెగా ఫ్యామిలీ కి షాకిచ్చి సాయిధర్మతేజ్!

తెలుగు సినిమా ఆడియన్స్ మెగా ఫ్యామిలీ ని బాగా ఆదరించారని చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నంత మంది హీరోలు, వేరే ఫ్యామిలీ నుంచి లేరనే అనిపిస్తుంది. మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మంచి హీరో. సాయిధర్మతేజ్ తనదైన శైలిలో నటిస్తూ.. ఎక్కువగా చిరంజీవి కట్స్ తో కనిపించే హీరో. చిరు పాటలను తన సినిమాలో పెట్టుకోవడంలో సాయిధర్మతేజ్ ఎక్కువగా ఇష్టపడతాడు.

See also  Chiranjeevi - Pawan Kalyan: రైల్వేస్టేషన్ లో చిరంజీవి పరువు తీసిన పవన్ కళ్యాణ్!

సినిమాల మీద సినిమాలతో బిజీగా ఉన్న సాయిధర్మతేజ్ కు యాక్సిడెంట్ వలన కొంత బ్రేక్ వచ్చింది. ఆ యాక్సిడెంట్ టైంలో మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫాన్స్ చాలా ఆందోళనకు గురయ్యారు. ఆ తరవాత నిమ్మదిగా దేవుడి దయవలన సాయిధర్మతేజ్ ఆరోగ్యం కుదుట పడింది. ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవల సాయిధర్మతేజ్ ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ సాయిధర్మతేజ్ చెప్పిన మాటలు అందరికి షాక్ కలిగించాయి.

See also  Sharwanand Wedding: అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ పెళ్ళి ఆగిపోనుందా.? ఫుల్ క్లారిటీ ఇచ్చిన శర్వా టీం..

కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి వెళ్లారు. ఈ సినిమా మురళి కిషోర్ దర్శకత్వంలో.. మురళీ శర్మ కీలక పాత్ర నటించారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.ఈ ఈవెంట్ లో సాయిధర్మతేజ్ ని అభిమానులు మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి సాయి ధర్మతేజ్ జవాబు ఇస్తూ.. నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అన్నాడు.

See also  Singer Sunitha : సింగర్ సునీత తన మొదటి భర్తతో విడిపోవడానికి అసలు కారణం అదా?

అంతే కాదు నాకు ఇప్పటికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి అన్నాడు. ఈ మాట మెగా ఫ్యాన్స్ , అక్కడ స్టేజ్ మీద ఉన్నవారు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీ కూడా షాక్ అయ్యిందంట. మరి అలా సాయిధర్మతేజ్ ఎందుకు అన్నాడో తెలీదు కానీ.. అందరికీ ఆశ్చర్యాన్ని మాత్రం కలిగించింది.