Home Cinema Sai Dharam Tej: పక్క ప్లాన్ తో 100 కోట్లు కొట్టేయడానికి ఎదురుచూస్తున్న సాయి ధరంతేజ్.!!...

Sai Dharam Tej: పక్క ప్లాన్ తో 100 కోట్లు కొట్టేయడానికి ఎదురుచూస్తున్న సాయి ధరంతేజ్.!! ఎందుకంటే.?

Sai Dharam Tej Virupaksha: మనందరికీ తెలుసు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో కొత్త కథతో తన తాజా చిత్రం విరూపాక్ష తో మన ముందుకు రాబోతున్నాడు. కేవలం ఈ చిత్రంతో మాత్రమే కాకుండా పక్క ప్లాన్ తో 100 కోట్లు కొట్టేయడానికి ఎదురు చూస్తున్నాడు. అవును మీరు విన్నది నిజమే..అసలు విషయంలోకి వెళ్తే..అదేంటంటే. ఈ నెల విడుదల కానున్న సాయి ధరం తేజ్ తాజా సినిమా విరూపాక్ష విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హర్రర్ స్టోరీ ఈ చిత్రం. ఇక వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇక కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించాడు.

See also  Nayanthara : షారుఖ్ ఖాన్ మీద నయనతార చేసిన అలాంటి కామెంట్స్ వైరల్..

sai-dharam-tej-reveals-his-new-plan-on-virupaksha-event

బి.బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర చిత్ర ఎల్.ఎల్.పి, సుకుమార్ రైటింగ్ బ్యానర్లపై బి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించినటువంటి ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ గానం చేకూర్చాడు. ఇక ఈ సినిమా ఈనెల 21వ తారీకు మన ముందుకు రానున్నది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా ఇటీవలే బయటకు వచ్చినటువంటి ట్రైలర్తో ఈ చిత్రానికి మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు.సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఆశలైతే పెట్టుకున్నాడు. విడుదల అయ్యాక తెలుస్తుంది మరి సాయి ధరం తేజ్ పెట్టుకున్నా ఆశ ఫలిస్తుందో లేదో..

sai-dharam-tej-reveals-his-new-plan-on-virupaksha-event

ఎన్నో అంచనాలతో అందరి నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు గ్రాస్ వసూలను రాబట్టాలని సాయి ధరం తేజ్ ఆరాటపడుతున్నాడు. ఇక తేజ్ కెరియర్లో ఇంతవరకు వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం ఒక్కటి కూడా లేదు. నిన్నగాక మొన్న వచ్చిన సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవి తేజ్ తన మొదటి సినిమా తోనే ఆ మార్కును అందుకున్నాడు. మరి ఇదే కాకుండా ఇటీవల వంద కోట్ల కలెక్షన్ అనేది పెద్ద విషయం కాదన్నంతల మన టాలీవుడ్ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసి చూపిస్తున్నాయి. మరి ఆ ధైర్యం తోనే తేజ్ కూడా ఈ సారి ఎలా అయినా ఈ మార్క్ దాటాలని ఆశపడుతున్నాడట..

See also  Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా అడిగాను”

sai-dharam-tej-reveals-his-new-plan-on-virupaksha-event

సినిమా హిట్ టాక్ అని వస్తే చాలు సులభంగా వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అనే ధీమాగా ఉన్నారు తేజ్.ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే వంద కోట్ల క్లబ్ లోకి కాకుండా టైర్ టు హీరోలు కూడా వచ్చి చేరిపోతున్నారు. ఇటీవల విడుదలైన నాని చిత్రం దసరా తో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అంతకుముందు కార్తికేయ 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి మార్క్ అందుకుని వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇదే నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కూడా ఆ మార్కును ఎలాగైనా అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. మరి సాయి ధరం తేజ్ (Sai Dharam Tej Virupaksha) కోరిక విరూపాక్షతో తీరనుందో లేదా వేచి చూడాలి.