Tamannaah : సినిమా రంగంలో హీరోలకి హీరోయిన్స్ కి నటీనటులకి మధ్య ఎవరెవరుకు ఎవరెవరితోనో రిలేషన్ ఉందని, డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ఎంతవరకు నిజాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. చివరికి నిజమైతే అది కొంతకాలానికి అది నిలబడుతుంది.. బయటికి వస్తుంది. అది రూమర్ అయితే కొంతకాలానికి అలాగే ( Tamannaah and Pakistan cricketer ) మరుగడిపోతుంది. ఇదంతా ఎంత సహజమో అందరికీ తెలుసు. అలాగే హీరోయిన్స్ పై కొంచెం ఎక్కువగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. మిల్కీ బ్యూటీ తమన్న ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ.. ఇంచునించుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక స్థానాన్ని అందరి హృదయాల్లో నిలుపుకుంది.
తమన్నా ఇప్పుడు సినిమాలతో, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. తమన్నా లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో విజయ వర్మ అనే నటుడుతో తనకి పరిచయం ఏర్పడింది. బాలీవుడ్ నటుడైన విజయవర్మతో ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్యన ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తమన్న, విజయ్ వర్మ కూడా బహిరంగంగా అందరికీ ( Tamannaah and Pakistan cricketer ) చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉండడం.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని అభిమానులు వైరల్ చేయడం కూడా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తమన్నా మీద కొత్త వార్తసోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొత్త అంటే ఇదేమి కొత్త కాదు. పాత వార్తని మళ్లీ కొత్తగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
తమన్నాకి ఇంతకుముందే పెళ్లయిందని.. తన మొదటి భర్త కి పిల్లలు కూడా ఉన్నారని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సడన్గా చూసిన వెంటనే.. కొందరికి ఇదేమిటి తమన్నా ఎప్పుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది కదా.. ఇప్పుడు మళ్లీ ముందుగా పెళ్లయింది.. అతనికి పిల్లలు ఉన్నారు అంటారేమిటి అని షాక్ కురువుతున్నారు. అయితే ఇందులో అసలు సంగతేమిటంటే.. 2017 సంవత్సరంలో తమన్న రజాక్ ఇద్దరూ దుబాయ్ లోనే ఓ ( Tamannaah and Pakistan cricketer ) నగల దుకాణాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. అక్కడే వీళ్ళిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. అక్కడ కలుసుకున్న వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి ఒకరి మధ్య ఒకరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. దానితో ఇద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతూ.. ఫోటోలు తీసుకుని తీసుకున్నారు. ఆ ఫోటోలన్నీ బయటకు రావడం జరిగింది.
అయితే అప్పట్లో ఆ ఫోటోలని చూసి మీడియాలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని.. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని కొందరు అంటే.. మరికొందరు వీళ్లిద్దరికి సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపోయిందని అప్పట్లో రూమర్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత తమన్న అతనికి తనకు ఎటువంటి సంబంధం లేదని.. కేవలం స్నేహితులం మాత్రమే అని.. అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాడని.. ఇలాంటి రోమర్స్ ని పూర్తిగా ఆపమని తమన్నా చెప్పగా.. తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో పడిందని బహిరంగంగా చెప్పిన తర్వాత.. మళ్లీ కొందరు అప్పటి న్యూస్ ని, అప్పటి ఫోటోలు ను ఇప్పుడు బయటకు తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో మళ్లీ అప్పటి వార్తని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. దీనివలన అందరూ ఇప్పుడు తమన్నా కి ముందే పెళ్లయిందేమో అనుకొని భ్రమ పడుతున్నారు. నిజానికి తమన్నకి ఎవరితోనీ పెళ్లి జరగలేదు. ఇప్పుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉండగా.. అతని పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి మరి..