Home Cinema Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్...

Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

roshan-kanakala-movie-bubblegum-teaser-review-and-rajeev-and-suma-comments

Bubblegum Teaser Review : రాజీవ్ కనకాల, సుమా దంపతుల కొడుకు రోషన్ కనకాల సినిమా బబుల్ గమ్ టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఈ టీజర్ చూడగానే అందరిలోని ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరిగింది. కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని అనుకుంటున్నారు. అసలు టీజర్ ఎలా ఉందొ చూద్దాం. టీజర్ మొదలే ( Bubblegum Teaser Review ) ప్రేమ గురించి నిర్వచనం చెప్తాడు. ప్రేమ మొదట చాలా తీయగా బాగుంటుందని, తర్వాత బబుల్ గమ్ లాగా అదే అంటుకొని సీట్లు కింద సినిమా స్కూటర్ కింద ఇలా అన్నిచోట్ల అంటుకొని వేధిస్తుందని అంటాడు. దీనితో యూత్ ని బాగా అట్రాక్ట్ చేసుకునే డైలాగ్స్ ఉంటాయని అర్థమవుతుంది.

Bubblegum-movie-teaser-review

ఉద్యోగం అంటే ఎలా ఉండాలి అనేదానిపై ఒక వ్యక్తి చెప్తున్న మాటలు బట్టి సినిమాలో రోషన్ కనకాల ఉద్యోగం, బాధ్యత ఇవి లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడులా చూపిస్తారని తెలుస్తుంది. ఇక టీజర్ లో పబ్లో హీరోయిన్ ఎంట్రీ ( Bubblegum Teaser Review ) ఆ టైంలో మ్యూజిక్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఉన్న సినిమా లుక్ ల కనిపించింది. ఇక టీజర్ లో పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు తోముకపోయినా వచ్చి ముద్దు పెడతా అనే డైలాగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుర్రాళ్ళు ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఇదొక ఫ్యాషన్ కింద ఫీల్ అయిపోతున్నారు. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా అనే డైలాగుతో యూత్ ని ఈ సినిమాకి గట్టిగా కనెక్ట్ చేసాడు దర్శకుడు.

See also  Chiranjeevi-Surekha : చిరంజీవి సురేఖ గొడవపడితే సురేఖ వెంటనే ఇది చేస్తాడంట..

Bubblegum-movie-teaser-dailog-viral

అప్పటివరకు అల్లరి చిల్లరగా అమ్మాయి ప్రేమలో పడి.. అమ్మాయి వెనకాల తిరిగే కుర్రాన్ని చూపించిన టీజర్.. సడన్గా నాకు నచ్చినట్టు మార్చుకుంటా నాకు కావాల్సింది దక్కించుకుంటా అది ఇజ్జత్ అయినా ఔకాత్ అయినా అనే హీరో డైలాగ్స్ తో ( Bubblegum Teaser Review ) సినిమాలో హీరో చాలా పట్టుదల ఉన్న వాడని, హీరో ని చాలా బాగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఇక హీరో , హీరోయిన్ లిప్ లాక్ సీన్ మాత్రం హాలీవుడ్ సినిమాలు రేంజ్ లో బాలీవుడ్ ని మించిపోయి ఉన్నట్టుగా తీశారు. మొదటి సినిమాతోనే ఇంత బోల్డ్ గా నటించాలా ఇలాంటివి అవసరమా అని కొంతమంది కామెంట్స్ కూడా వచ్చినప్పటికీ.. కుర్రాళ్ళు మాత్రం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే విధంగా టీజర్ తో అట్రాక్ట్ చేసుకున్నారు.

See also  Renu Desai: పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎటాక్ ఇచ్చిన రేణుదేశాయ్.. అతనేంచేసాడో సీక్రెట్ బయట పెట్టింది!

Bubblegum-movie-teaser-review-suma-kanakala

ఇక లాస్ట్ లో హీరో నేను జనరల్గా ఇంత గలీజ్ గా బిహేవ్ చేయను అంటే హీరోయిన్ సో క్యూట్ అనే అనే డైలాగ్ తో అమ్మాయిల మెంటాలిటీని డిస్క్రైబ్ చేసినట్టుగా అనిపించింది. ఇక టీజర్ లో మ్యూజిక్ చాలా బాగుంది. ఏదేమైనా ఇప్పటి యూత్ ని బాగా స్టడీ చేసి.. వాళ్ళకి ఎలాంటి సీన్స్, ఎలాంటి స్టోరీ, ఎలాంటి డైలాగ్స్, ఎలాంటి కామెడీ ఉంటే బాగుంటుందో బాగా కనెక్ట్ చేసుకొని సినిమా తీసినట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో రోషన్ తల్లిదండ్రులు రాజీవ్ కనకాల, సుమ కనకాల కూడా ఉండడంతో.. రాజీవ్ కనకాల రోషన్ రొమాన్స్ సీన్ గురించి మాట్లాడబోతూ ఉండగా.. సుమ మనం కొన్ని మాట్లాడకూడదు రాజా మనం చూసి చూడనట్టు తప్పుకోవాలి అంటూ రాజీవ్ కనకాలని లాక్కొని వెళ్లిపోవడం అక్కడ అందరికీ చాలా ఆనందాన్ని, నవ్వుని కలిగించింది.