పవన్ కళ్యాణ్ కు రాజకీయ సమాధి వీళ్ళే కడతారంట!
ఆంద్రప్రదేశ్ లో రాజకీయాల వేడి మహా జోరుగా ఉంది. ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఇప్పటి నుంచే పబ్లిక్ మీటింగ్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అమాయక ప్రజల్లో కొందరు ఇటీవల సభలో చనిపోవడం కూడా జరిగింది. దీనితో ప్రజలు, అధికార పార్టీ కూడా గట్టిగానే స్పందించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ కి వ్యతిరేకంగా ప్రచారాలు మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ మాటలు, ప్రవర్తన చాలా హైపర్ గా ఉంటున్నాయి. ఆయన చెప్పు చూపించి మాట్లాడటం మొదలు… అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పొలిటికల్ సైకో అని మండి పడ్డారు. అంతేకాకుండా ఇలాంటి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడానికే రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కి మనుషుల ప్రాణాలు అంటే అస్సలు విలువ లేదు అని అన్నారు. ఇప్పటం పర్యటనలో పవన్ కళ్యాణ్ వేషం, కూర్చునే విధానం అసలు ఒక పొలిటీషన్ లా ఉందా అని ప్రశ్నించారు. కాలు చాపుకుని వాహనం పై కూర్చున్న విధానమే చెబుతుంది ఆయన ఒక పొలిటీషన్ గా పనికిరాడని అని అన్నారు. పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ పై అవగాహన లేదని, అసలు ఆంధ్రప్రదేశ్ పై అభిమానం లేదని అందుకే ఆంధ్ర అభివృద్ధికి అతను కృషి చేయకపోగా అడ్డం పడుతున్నాడని అన్నారు.
ఇప్పటం పర్యటనలో అతని వాహనం వెళ్లిన స్పీడ్ కి ఎవరికైనా ప్రమాదం జరుగుతాదనే బాధ్యత కూడా లేదని అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసి, గోడ కట్టుకున్న వారి గోడని కూలిస్తే, వెళ్లి వాళ్లకి లక్ష రూపాయలు ఇచ్చి పెద్ద సీన్ చేసాడు. మరి చంద్రబాబు కందుకూరి సభలో… చనిపోయిన వారి గురించి మాత్రం పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాల గురించి మాత్రం అస్సలు ప్రశ్నించడు. చంద్రబాబు వలన చనిపోయినవారిని పరామర్శించడం గాని, వారికి నష్టపరిహారం ఇవ్వడం గాని పవన్ కళ్యాణ్ చెయ్యలేదు. ఒక అక్రమ కట్టడానికి ఇచ్చిన విలువ, ప్రజల ప్రాణాలకు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. ఇలాంటి వాడికి ప్రజలే రాజకీయ సమాధి కడతారు అని అన్నారు.