RGV sensational comments on Rajamouli: ఆర్జీవీ ( రాంగోపాల్ వర్మ) అంటే కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆర్జీవీ అంటే సెన్సేషన్, లేదా సెన్సేషన్ ఉన్న చోట ఆర్జీవీ అని అందరికీ తెలుసు. ఎందుకంటే రాంగోపాల్ వర్మ చాల ధైర్యం ఉన్న మనిషి, ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఎదుటివారికి చెప్పగలిగే మనిషి. అందులోను మామూలు వారికి కూడా కాదు, సెలబ్రెటీస్ కి ఇంకా స్ట్రాంగ్ గా చెబుతాడు. అతని కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి గాని, నిజానికి దగ్గరగా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. అందుకే రామ్ గోపాల్ వర్మ కి ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాలో హిట్ అనేది కొట్టలేదు కానీ, ఆయన మీద క్రేజ్ పోలేదు. ఆయన కామెంట్స్ నెటిజనులు చాలా శ్రద్దగా చూస్తారు. వాటికి రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సెలబ్రెటీస్ అందరూ, రాజమౌళిని పొగుడుతూ ఉంటె, ఆర్జీవీ మాత్రం రాజమౌళిని నానా మాటలు అన్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పుడు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా దేశం మొత్తంలో ఎన్నో అవార్డులు తెచ్చుకోగా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుగు వాడి సత్తా తెలిసేలా ఆస్కార్ అవార్డు సాధించాడు రాజమౌళి. ఈ క్రెడిట్ మొత్తం అనారో రాజమౌళి మీదనే వేశారు. ఇందులో ఎందరిదో పాత్ర ఉండచ్చుగాని, ఈ సక్సెస్ కి మాత్రం సూత్రధారి రాజమౌళి అని అందరికి తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రాజమౌళి లాంటి దర్శకుడు దొరకడం అదృష్టం అని అందరూ అనుకుంటుంటే, వెరైటీగా రాజమౌళి పై ఆర్జీవీ నెగటివ్ కామెంట్స్ చెయ్యడం ఇపుడు అందరికీ షాకింగ్ గా ఉంది. ఆర్జీవీ పొగిడే చోట పొగుడుతాడు, అలాగే తన మనసుకు నచ్చనిదవారైనా చేస్తే వెంటనే దులిపేస్తాడని తెలుసు గానీ,ఈ టైం లో రాజమౌళి పై వ్యతిరేక కామెంట్ చేసాడంటే.. షాకింగానే ఉంది.
రాజమౌళి గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమాలో ( RGV sensational comments on Rajamouli ) కంటెంట్ ఉంటె ఎన్ని వేల కోట్ల బిజినెస్ అయినా చెయ్యవచ్చని రాజమౌళి నిరూపించారని చెప్పాడు. కానీ సినిమా అంటే అంత భారీ బడ్జెట్ సినిమా తీస్తేనే అది సినిమా అన్నట్టు తయారయ్యింది ఇండస్ట్రీ అని అన్నారు. పెద్ద పెద్ద బడ్జెట్ తో సినిమా తియ్యడం, అది తిరిగి రాబట్టుకోవడానికి సినిమా టికెట్స్ రేట్స్ పెంచడం. దీనివలన సామాన్యుడికి సమస్య అవుతుంది. ఓటీటీ వలన సినిమా ఇండస్ట్రీ నష్టపోతుందని అంటున్నారు గాని, అందులో నిజం లేదు. ఇలాంటి పెద్ద సినిమాలు వలన సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది. ప్రేక్షకులు ప్రతీ సినిమాని రజమౌళి సినిమాతో పోల్చి చూస్తున్నారు. ఆలా అయితే ఇంక అన్నిసినిమాలు రాజమౌళినే తియ్యాలి. అలాంటి సినిమా అయితే ధియేటర్ కి వెళదాం, లేదంటే ఓటీటీ లో చూద్దామని ఫిక్స్ అవుతున్నారు.
అంతే కాకుండా రాజమౌళి తో పోటీ పడాలని, ఇతర సినిమాల డైరెక్టర్స్ నిర్మాతలతో దగ్గర దగ్గరగా అంతంత బుడ్జెట్స్ పెట్టించి సినిమా తీయిస్తున్నారు., ఏమాత్రం తేడా వచ్చినా, ఎవరెవరికి ఎంతెంత భారీ నష్టం వస్తాదో ఆలోచించడం లేదు అని అన్నారు. మొత్తానికి ఆర్జీవీ చెప్పినదాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ ని రాజమౌళి పాడు చేస్తున్నట్టు చెప్పారు.