Home Cinema Renu Desai : చాన్నాళ్లకు అతని.. ప్రేమలో పడి ప్రత్యేకమైన అనుభూతిని పొందానంటున్న రేణుదేశాయ్..

Renu Desai : చాన్నాళ్లకు అతని.. ప్రేమలో పడి ప్రత్యేకమైన అనుభూతిని పొందానంటున్న రేణుదేశాయ్..

renu-desai-sensational-post-about-animal-movie-became-viral

Renu Desai : సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు వీలైనంతవరకు అనిమల్ సినిమా గురించి వాళ్ళ అభిప్రాయాల్ని ఇంకొకరితో పంచుకుంటూనే వస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ( Renu Desai post about Animal ) ఇక ఇలాంటి అభిప్రాయాలను పంచుకోవడానికి ఎక్కడ అవధులు లేవు. సందీప్ రెడ్డివంగ ఒక్కసారిగా భారతదేశమంతా కూడా సినీ అభిమానుల గుండెల్లో నిండిపోయాడు. ఒక్కొక్కరు వాళ్ళు అభిప్రాయాలను ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అందులో కొన్ని పాజిటివ్ ఉంటే.. కొన్ని నెగటివ్ కూడా ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఐదు రోజుల్లో 500 కోట్ల రూపాయల కలెక్షన్ తీసుకొచ్చేసింది.

Renu-Desai-sensational-comments-about-animal

ఇప్పటికే 500 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టేసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలో ప్రతి నటుడు కూడా తన పాత్రలో జీవించేసాడు. ఇది కేవలం దర్శకుడు ప్రతిభ అని గొంతుఎత్తి చాటుతున్నారు ఆడియన్స్. సినిమా ( Renu Desai post about Animal ) ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా సందీప్ రెడ్డి వంగవైపు తొంగి చూస్తుంది. ఎలాంటి దర్శకుడు ఈ దర్శకుడు, ఏం మిరాకిల్ సృష్టిస్తున్నాడు, ఎలా హిప్నటైజ్ చేశాడు అభిమానుల్ని అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఈ సినిమాపై ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలను ఎంతో చక్కగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు రేణు దేశాయ్ వంతు వచ్చింది. రేణు దేశాయ్ ఎవరు అనేది మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పనిలేదు.

See also  Krithi Shetty: అందుకోసమే కృతి శెట్టి ఆ మందులను వాడుతున్నదా.? నెట్టింట నడుస్తున్న రచ్చ రచ్చ

Renu-Desai-sensational-comments-about-animal-post

ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి అతనితో కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒక కొడుకు ఒక కూతురు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ కావాలనుకుంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు కానీ చేసుకోకుండా పిల్లల కోసం అలా ఉండిపోయి.. ప్రశాంతంగా బ్రతుకుతుంది. అయితే ( Renu Desai post about Animal ) అప్పుడప్పుడు ఆమెను పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.. ఆమెపై విపరీతమైన నిందలు వేస్తూ ప్రదర్శిస్తుంటారు. అందుకారణంగా ఆమె కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా ఆమె ఎక్కడ జంకకుండా ఒక్కొక్కసారి గట్టిగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. రేణుదేశాయ్ పవన్ ప్రేమలో పడేటప్పటికీ ఆమె హీరోయిన్ గా మంచి లీడింగ్ లో ఉంది.

See also  Nagarjuna : అక్కినేని నాగార్జున సాధించిన ఈ అరుదైన రికార్డ్స్ చాలా మందికి తెలియదు.. బర్త్ డే స్పెషల్ స్టోరీ.

Renu-Desai-sensational-comments-about-animal-viral

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత ఆమె ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది. సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల ఆమె మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె ఒక ప్రత్యేక పాత్రను పోషించి అందరి మన్ననలను పొందింది. అయితే ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేణు దేశాయ్.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన సినిమాను అనిమల్ సినిమా చూసి.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనిమల్ సినిమాని చూశాను.. సినిమా చూసి నిస్సందేహంగా ప్రేమలో పడ్డాను. ఆ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా ధియేటర్లో చూడ్డం మిస్ అవ్వద్దు అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. రేణు దేశాయ్ ఇంత కాలం తర్వాత నిస్సందేహంగా ప్రేమలో పడ్డాను అనే పదాన్ని వాడడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలని, ఆ సినిమాలో నటించిన ప్రతి పాత్రని ప్రేమించడం.. ఈ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ సినిమా ప్రేమలో పడిందని.. ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.