Prabhas : టాలీవుడ్ లో ప్రభాస్ స్థానాన్ని ఎవ్వరు కొట్టలేరు, ఎందుకంటే ఆయనకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ అలాంటిది. టాలీవుడ్ ని బాహుబలి సినిమా తో జక్కన్న హాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేసాడు. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రాజమౌళికి కూడా బాహుబలి తన జీవితంలో ఒక పెద్ద సక్సెస్. ప్రభాస్ ఇటీవలే సాలార్ సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ లను రాబట్టింది.
బాహుబలి సినిమా తరువాత మన రెబెల్ స్టార్ ప్రభాస్ కు పెద్దగా సక్సెస్లు రాలేదు సాహి, రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు పెద్దగా ప్రభాస్ ఫాన్స్ ని కంపించలేకపోయాయి. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కు సంబందించిన ఒక ప్రశ్న నెట్టింట చాల ట్రెండ్ అవుతుంది. అదేంటంటే, ప్రభాస్ ఫేవరెట్ హీరో ఎవరు..? అది ముఖ్యంగా టాలీవుడ్ లో(Prabhas Favourite Hero). ఏ హీరోకైనా ఒక హీరో అంటే చాల ఇష్టం ఉంటుంది, వారు బయటకి చెప్పకపోయినా మనసులో ఐతే కచ్చితంగా ఉంటుంది.
అలా తమ ఫేవరెట్ హీరో పై అభిమానం ఉంటుంది. ప్రభాస్ కి ఇష్టమైన హీరో ఇతనే అంటూ ఫాన్స్ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్ గారు(Prabhas Favourite Hero). ప్రభాస్ చాల సందర్భాలలో తనకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాల ఇష్టం అని చెప్పాడు. అంతే కాకుండా అయన నటించిన ఖుషి సినిమా చాల ఇష్టం అని ప్రభాస్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.