Adah Sharma: ఇటీవల విడుదలై ఘన విజయంతో దూసుకుపోతున్న చిత్రం ది కేరళ స్టోరీ.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఆదాశర్మ.. ఈ చిత్రం తర్వాత ఆదాశర్మ స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిందనే చెప్పాలి. ఎన్నో వివాదాలు నడుమ ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని మాత్రం కొన్నిచోట్ల ప్రదర్శనకు అనుమతించడం లేదు. మరియు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని అనుమతించలేదు. కానీ.. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోని ప్రజలు దీనిని చూడడానికి క్యూలు కడుతున్నారు. ఇక ఈ చిత్రం విడుదల కాకముందే ఆదా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నది.
అందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పావని మల్హోత్రాతో తన అసలు పేరు చాముండేశ్వరి అయ్యార్ అని తెలిపింది. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాతే తన పేరును ఆదాశర్మగా మార్చుకున్నాను అని తెలిపింది. ఇంకా ఈ షో నిర్వహించిన పోస్ట్ ఆదాను ఇంత సాధారణ పేరు ఎక్కడిది అని అడిగినప్పుడు ఆమె మరో ఆసక్తికరమైన విషయం తెలిపింది. నా అసలు పేరు చాముండేశ్వరి అయ్యర్ నా పేరు చెప్పడానికి వచ్చిన కొత్తలో ఎంతో కష్టంగా ఉండడం వల్లే నేను పేరు మార్చుకున్నాను అని తెలిపింది. ఇకపోతే ఆదాశర్మ 2008లో విడుదలైన హర్రర్ మూవీ 1920 లో రజనీస్ దుగ్గల్ సరసన ఆదాశర్మ నటించి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ఇంకా ఈ సినిమా ఘనవిజయం సాధించగా ఆమెకు మొదటిసారి మొదటి సినిమా తోనే మంచి ఫలితం లభించింది. ఇక ఆ తర్వాత తను నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించినప్పటికీ ఆమె ప్రజాదారణ నెమ్మ నెమ్మదిగా కోల్పోయిందని చెప్పాలి. ఇక విద్యుత్ జమ్వాల్ తో కమాండో సిరీస్ మరదే విధంగా హాసితో ఫసి మరియు సెల్ఫీ లాంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. అయితే ఈ లో చిత్రాలలో ఆమెకు అంత పెద్ద గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒకటి రెండు సినిమాలు చేసి హిట్ కొట్టాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం కేరళ స్టోరీ సినిమా నుంచి చాలా బిగ్ హిట్ వచ్చింది అనే చెప్పాలి.
ఇకపోతే ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్.. కొంతమంది కాలేజీ వయసులో ఉన్న అమ్మాయిలను ముస్లింలుగా మారడానికి ఎలా మోసగించబడ్డారన్న విషయం గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను మతం మార్చిన తర్వాత వారిని బలవంతంగా ఐఎస్ఐఎస్ లో చేర్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పంపించారు. ఇక ఈ చిత్రంలో ఆదా (Adah Sharma) ముఖ్యపాత్రలో నటించగా ఆమెతోపాటు యోగితా భిహాని, సోనియా బలాని మరియు సిద్ది ఇద్నాని కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో పోషించారు. ఇక ఇప్పటికే హిందీలో విడుదలై సంచలన సృష్టించిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల అవ్వనుంది. మరి ఇక్కడ చూడాలి మరి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో..