Home Cinema Kalyan Ram: కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అసలు సీక్రెట్ తెలిస్తే.. అవాక్కు అవుతారు..

Kalyan Ram: కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అసలు సీక్రెట్ తెలిస్తే.. అవాక్కు అవుతారు..

గత ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార సినిమా మంచి హిట్ కొట్టడంతో.. నందమూరి ఫాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అంత హిట్ సినిమా తరవాత ఇప్పుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన “అమిగోస్” సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై అందరికి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఫిబ్రవరి 10 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఇటీవల జరిగింది. ఆడియో ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు. అలాగే కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… తనకు ఎప్పుడు వెన్నంటి తోడుగా ఉన్న తన సోదరుడు ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా, సినీ అభిమానులకు నచ్చుతుందని కళ్యాణ్ రామ్ చెప్పారు.

See also  Guntur Kaaram : గుంటూరు కారం పాట ఎందుకు అంత దారుణంగా ఉందొ చెప్పగలరా?

అమిగోస్ సినిమా ప్రమోషన్ కోసం కళ్యాణ్ రామ్ చాలా ఇంటర్వ్యూ లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న టాటూ గురించి అడగగా ఆయన సమాధానం ఇలా చెప్పారు. స్వాతి అనే టాటూ తన భార్య పేరు అని చెప్పారు. కళ్యాణ్ రామ్ కి 2007 ప్రాంతంలో హెల్త్ బాగా పాడయ్యిందని, ఆ సమయంలో తన భార్య తనకి చాలా సేవ చేసిందని చెప్పారు. ఒక ఇంజక్షన్ చేయించుకోవాలన్నా కూడా కళ్యాణ్ రామ్ కి చాల భయమంట.

See also  Allu Arjun - Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత పెద్ద గొడవ చేస్తున్నాడట..

అలాంటిది టాటూ వేయించుకున్నాను అంటే, ఆమె మీద నాకు అంత ప్రేమ ఉందని కళ్యాణ్ రామ్ చెప్పారు. నా భార్య లేకపోతే నేను లేను. ఆమె నాకు ఒక తల్లిలా సేవ చేసింది. నా భార్య నా పై చూపించిన కేరింగ్ వలనే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడినయ్యాను అని చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ కి భార్య పై ఉన్న ప్రేమ తెలిసి, అందరూ అవాక్కు అయ్యారు..