Mahesh – Ravi Teja : సినిమా అంటే మొదట మూలం కథ. ఆ కథతో సంబంధించిన ప్రతి పాయింట్ ని ఆలోచించుకుని దాని దగ్గర బడ్జెట్ ని, ప్రొడక్షన్ ని అన్నిటిని సిద్ధం చేసుకుని.. దర్శకుడు సినిమా గురించి అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. అయితే బ్లాక్ బస్టర్ హీట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా కథలో ఒక మూలం ( Ravi Teja rejected this story ) ఉండాలి. అలాగే అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఒక్కొక్క కథ ఒక్కొక్క హీరోని వరించి వస్తాయి. అలాంటి అదృష్టమే రవితేజ కాదంటే మహేష్ బాబు అవునని తన లైఫ్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని చేర్చుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే పోకిరి. పోకిరి సినిమా అనగానే.. వెంటనే ఇదా ఇంత గొప్ప సినిమాని రవితేజ వదులుకున్నాడా అని అనుకుంటున్నారా?
అవును రవితేజ చేజార్చుకున్న ఈ సినిమా మహేష్ అందుకని సూపర్ హిట్ కొట్టాడు. అసలు ఏం జరిగిందంటే.. పోకిరి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్గా రూపొందింది. ఈ సినిమా 10 కోట్ల బడ్జెట్ తో తీస్తే 40 కోట్లు షేర్ 70 కోట్ల గ్రాస్ వసూలు సొంతం చేసుకుంది. అయితే పూరి జగన్నాథ్ ( Ravi Teja rejected this story ) ఇంత సూపర్ హిట్ కథని బద్రి సినిమా సమయంలో రాసుకున్నాడంట. ఈ కథకి ఉత్తం సింగ్ సన్నాఫ్ సత్యనారాయణ అని పేరు కూడా పెట్టుకున్నాడు అంట. మొదట రవితేజతో ఈ కథ గురించి చెబితే.. రవితేజ దీనికి ఓకే చెప్పాడంట. ఆ సమయంలో తమిళ్ సినిమా ఆటోగ్రాఫ్ రీమేక్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమా అవకాసం రావడంతో రవితేజ కి ఆ కథ బాగా నచ్చి..
మొదట ఆ సినిమా చేసిన తర్వాత ఇది చేద్దాం అని చెప్పాడంట. సరే అని పూరి జగన్నాథ్ రవితేజ ఫ్రీ అయ్యే లోపు.. ఏదో ఒక సినిమా చేసుకోవాలని.. వాళ్ళ తమ్ముడు తో 143 అనే సినిమా పూర్తి చేసాడు. ఆ తర్వాత రవితేజ దగ్గరికి వెళ్ళగా.. రవితేజ డేట్స్ ( Ravi Teja rejected this story ) అప్పటికి కూడా ఖాళీ లేవంట. ఇంక ఈ కథను అలా పట్టుకొని టైం వేస్ట్ చేయడం అనవసరమని.. పూరి జగన్నాథ్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లి ఈ కథ చెప్పగా.. మహేష్ బాబు వెంటనే కథకు ఓకే చెప్పాడంట. అప్పుడు ఆ కథకి మహేష్ బాబు హీరోయిజానికి తగ్గట్టు ఆ సినిమాకి టైటిల్ పోకిరి అని సెట్ చేసుకొని సినిమాని తీయడం జరిగిందట.
అలా మహేష్ బాబు ఆ సినిమా అందుకని బ్లాక్ బస్టర్ హెడ్ కొట్టాడు. దీన్నే అదృష్టం అని కూడా అనుకోవచ్చు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. మనకు ఉండే తెలివితో పాటు, మనకు అది అందుకునే అదృష్టం కూడా ఉంటే రెండు జోడించి మనకి కలిసి వస్తుందని పెద్దలు అంటారు. పోకిరి సినిమా అప్పట్లో కొట్టిన హిట్ ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోయే స్థితిలో లేరు. పైగా ఐటెం సాంగ్ కి కూడా ఆ సినిమాతో చాలా కొత్త ట్రెండ్ వచ్చింది. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అనే పాట అప్పట్లో చాలామంది ఫోన్ లకి రింగ్ టోన్ ఉండేది. మొత్తానికి రవితేజ కాదంటే మహేష్ బాబు అవునని ఎంత పెద్ద హిట్ కొట్టాడో చూడండి.