
చిత్రం: టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao )
తారాగణం: రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్ తదితరులు..
కెమెరా:మది ఐ.ఎస్.సి
సంగీతం: జి. వి. ప్రకాష్
నిర్మాత : అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం : వంశీకృష్ణ నాయుడు
విడుదల తేదీ:20 october 2023 ( Tiger Nageswara Rao Review and Rating )
రవితేజ హీరోగా, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించిగా, వంశీకృష్ణ నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఈరోజు పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై మాస్ మహారాజు రవితేజ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే రవితేజ కి ఇది మొదటి పాన్ ఇండియా సినిమా. దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం..
కథ.
సినిమా మొదలు పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ శాస్త్రి ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ రాగానే బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరవాత పీఎం సెక్రటరీ, సెంట్రల్ బ్యూ రో ఆఫీస్ అందరు కలిసి మీటింగ్ పెట్టి.. విశ్వనాథ్ శాస్త్రిని టైగెర్ నాగేశ్వర రావు ( రవి తేజ ) గురించి అతనికి తెలిసిన ఇన్ఫిర్మషన్ చెప్పమని అడుగుతారు. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. స్టువర్టుపురం లో పుట్టి పెరిగిన నాగేశ్వరావు చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులోనే దొంగగా మారుతాడు. 8 ఏళ్ల వయసులో తన తండ్రిని చంపి దొంగగా మారిన నాగేశ్వరరావు పోలీసులకు ముందుగా చెప్పి మరీ దొంగతనాలు చేస్తాడు. ఇలా దొంగతనాలు చేస్తూ ఉండే నాగేశ్వరరావు ఒక మార్వాడి అమ్మాయిని ( నుపుర్ సనన్ ) ప్రేమిస్తాడు. నాగేశ్వరావు ని తమిళనాడు పోలీస్ జైల్లో పెడతారు. ఆ జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్నాడు. ఈ కథ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు ఆ తర్వాత నాగేశ్వరరావు ప్రధానమంత్రి ఇంట్లో కూడా చెప్పి మరీ దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత నాగేశ్వరావు జీవితంలోకి తన మరదలు గాయత్రి భరద్వాజ్ వస్తుంది. ఈ కథ సాగుతున్న మధ్యలో విలన్ల పాత్ర చాలా గట్టిగానే ఉంటుంది. అయితే అసలు నాగేశ్వరరావు ఎందుకు చిన్నప్పుడే తండ్రి తల నరికాడు? ఎందుకు దొంగగా మారాల్సి వచ్చింది? అలాగే నాగేశ్వరావు లవర్ ఏమవుతుంది? ఇంకా పీఎం ఇంట్లో ఏం దొంగతనం చేశాడు? నాగేశ్వరావు మరదల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? నాగేశ్వరావు జీవిత లక్ష్యం ఏమిటి ? అసలు చివరికి ఏమౌతుంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా ధియేటర్ కి వెళ్లి చూడాల్సిందే..( Tiger Nageswara Rao Review and Rating )
సినిమా ఎలా ఉందంటే..
టైగర్ నాగేశ్వరావు సినిమా ఒక రియల్ స్టోరీ బయోపిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బయోపిక్ అనగానే సినిమాకి కొన్ని పరిధిలు ఉంటాయి. అందులోనూ టైగర్ నాగేశ్వర్ అనేవాడు ఒక పెద్ద దొంగ అవ్వడం వల్ల దాన్లో ఇంకా చాలా పరిధిలు ఉంటాయి అన్న విషయాన్ని ప్రేక్షకుడు ముందుగా మైండ్ కి ఎక్కించుకోవాలి. లేకపోతే సినిమాని నచ్చే కోణంలో చూడడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో చూస్తే రవితేజ యాక్షన్, పర్ఫామెన్స్ సూపర్ గా ఉంది. మురళీ శర్మ ఢిల్లీ వెళ్లి అక్కడ ముఖ్యమైన వ్యక్తులతో టైగర్ నాగేశ్వర్ రావు ( Tiger Nageswara Rao Review and Rating ) గురించి చెప్పిన పరిచయం, అతని గురించి చెబుతున్న విధానం బాగానే ఉంది కానీ.. అదేదో పెద్ద కొత్తగా అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి సినిమాలు అనేకం రావడం.. వాళ్ళ గురించి చాలా హైప్ లేపి ఎవరో ఒకరు చెప్పడం అనేది చాలా కామన్. అయితే ఒక దొంగ గురించి ఆ దొంగ మంచి మార్గంలో వెళ్లి ఉంటే ఒక పెద్ద ప్లేయర్ అయి ఉంటాడు లేదా పొలిటిషన్ అయి ఉంటాడు లేదాఎదో గొప్పోడు అయ్యి ఉంటాడు. అన్ని ట్యాలెంట్ లు ఉన్న దొంగ అని చెప్పే పరిచయ విధానం బాగుంది.
ఇక సినిమాలో ట్రైన్ రాబరీ చూసినంత సేపు బాగుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిన్నప్పటి కథ విలన్స్ తో తన పోటీ విధానం ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ కొంచెం బోర్ గా ఫీల్ అయ్యారు. చెప్పినదే ఏదో మళ్లీ చెప్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నుపుర్ సనన్ తో లవ్ ట్రాక్ బాగానే ఉంది కాకపోతే ఆ హీరోయిన్ గురించి ( Tiger Nageswara Rao Review and Rating ) కూడా హీరో ఇంకా విలన్సు కొంతవరకు ఫైట్ చేయడం అనేది యావరేజ్ గా అనిపించిన తప్ప హైలెట్గా ఏమీ అనిపించలేదు. నుపుర్ సనన్ తనకిచ్చిన పాత్రకి నాటు న్యాయం చేయడమే కాకుండా చాలా అందంగా కూడా కనిపించింది. అలాగే రవితేజ లవర్ ని కోల్పోయే సమయంలో ఆ సీన్ ని సెంటిమెంట్ తో పండించలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ ఆఫ్ సినిమా అక్కడక్కడా స్లో అయినట్టు అనిపించినా కూడా.. రవితేజ ని అంత అగ్రసివ్ గా చూడటం నచ్చింది.
ఇక సెకండ్ ఆఫ్ వచ్చేటప్పటికి ఫస్ట్ అఫ్ లో జరిగిన ప్రతీ సీన్ కి వ్యతిరేకంగా చెప్పడం వలన సినిమాలో సీన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు చిరాగ్గా అనిపించింది. సెకండ్ ఆఫ్ లో రవితేజ ఒక లక్ష్యం కోసం పోరాడే వీరుడిగా చూపించే క్రమంలో.. అసలు కథ అది కాదు, ఇది అని చెప్తున్నట్టు.. వింటున్నట్టు ఉంది తప్పా.. మన మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించలేకపోయాడు దర్శకుడు. గాయత్రీ భరద్వాజ్ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో కొంచెం రిలాక్స్ గా అనిపించింది. రవి తేజ, తన మరదలి మధ్య వచ్చే మాటలు, సీన్స్ అన్ని బాగున్నాయి. కానీ సెకండ్ హీరోయిన్ తో రవితేజ కెమిస్ట్రీ ఇంకా బాగా చూపిస్తే బాగుణ్ణు అనిపించింది. కానీ పాపం దర్శకుడికి దానిమీద అంత బ్రెయిన్ పెట్టడానికి టైం లేనట్టు,ఇప్పటికే సినిమా లెన్త్ పెరిగిపెరిగిపొండనె బాధ ఆ కాన్సెప్ట్ ని ఎక్కువగా చూపించలేకపోయారు.
ఇక సినిమాలో విలన్స్ అస్సలు బలంగా లేరు. విలన్స్ పెర్ఫామెన్స్ కూడా అందరు మన తెలుగువాళ్లు కాకపోవడం వలన ఓన్ చేసుకోవడం కూడా అవ్వలేదు. సెకండ్ హాఫ్ సినిమాని ఎందుకు అంతగా పొడిగించారో అర్ధం కాలేదు. ఈ సినిమాలో రేణుదేశాయ్ పాత్ర మంచిదే కానీ.. ఆమె కనిపించిన దగ్గర నుంచి ఈమె పాత్ర ఎప్పుడు అయిపోతాదిరా దేవుడా అని ప్రేక్షకుడు కోరుకున్నాడు. సినిమా ప్రమోషన్ కి పవన్ కళ్యాణ్ మాజీ భార్య ( Tiger Nageswara Rao Review and Rating ) అయితే బాగా బెనిఫిట్ అని తప్పా.. ఇంతకాలం తరవాత ఇప్పుడు ఆమెని అలాంటి పాత్రలో అర్జెంటు గా చూపించడం వలన ఎలాంటి లాభం లేదు.ఇక ఈ సినిమాలో రవితేజ నటన మాత్రం చాల నటించాడు. కానీ రవి తేజ ముఖం చాలా మారినట్టు అనిపిస్తుంది. ముఖంలో ముడతలు కనబడనీయకుండా ఉండటం అనేది మేకప్ మహిమ గాని, లేదా ఏదైనా సర్జరీ చేయింకున్నాడా అని సగటు ఆడియన్ కి డౌట్ వచ్చింది.
రవితేజ మాత్రం ఎప్పటిలానే చాలా జోష్ గా నటించాడు. సినిమా మొత్తాన్ని తన భుజం మీదే వేసుకుని మోశాడు. చివరలో అన్ని సాధించిన టైగర్ లాంటి భలం, ధైర్యంతో పాటు విపరీతమైన తెలివి ఉన్న టైగర్ నాగేశ్వర రావు.. విలన్లను చంపడం కోసం చావడం ఎందుకో ఆడియన్ కి నచ్చలేదు. ఇంకేదైనా రీజన్ చూపించి ఉంటె బాగుణ్ణు అనిపించింది. అసలు సినిమా ఇంతసేపు ఎందుకురా బాబు.. అని ప్రేక్షకుడికి ఒకానొక టైం లో విరక్తి కూడా వచ్చింది. టోటల్ గా చూస్తే.. రవి తేజ నటన, కొన్ని సీన్స్ గురించి సినిమా ప్రియులు ఒకసారి చూడచ్చు. కానీ అన్ని వయసుల వారిని ఈ సినిమా ఆకట్టుకోవడం చాలా కష్టం. సినిమాలో వైలెన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, హీరోయిన్స్ ఎక్సపోజింగ్ అన్ని బాగానే పెట్టినా కూడా.. సినిమా ఎంటర్టైన్మెంట్ గా అనిపించలేదు. మొత్తం మీద సినిమా యావరేజ్ గా ఉంది.
రేటింగ్ : 2.75/ 5