Home Cinema Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం…

Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం…

Siya Gautam: శియా గౌతమ్ అంటే కాస్త ఆలోచిస్తాం ఎవరబ్బా అని.. అదే రవితేజ సినిమా నేనింతే హీరోయిన్ అంటే టక్కున గుర్తుకొస్తది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఫీల్డ్ లోకి రావడానికి, అక్కడ రకరకాల స్థాయిల్లో పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల నడుమ ఈ సినిమా కథ నడుస్తూ ఉంటుంది. 2008లో ఈ సినిమా విడుదలయి మంచి హిట్ కొట్టింది.ravi-teja-co-star-siya-gautam-gets-married

See also  ChaiSam-VarunLav : చై సామ్ మరియు వరుణ్ లావ్ లనే మరో స్టార్ జంట పెళ్ళికి రెడీ..

తన తొలి సినిమా ఇది దాంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది శియా గౌతమ్. శియా గౌతమ్ అసలు పేరు అతిథి గౌతమ్. పుట్టింది పెరిగింది అంతా ముంబైలో.. తొలి చిత్రమైన నేనింతే తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో శియా గౌతమ్ కి పూర్తిగా అవకాశాలు రావడం మానేశాయి.ravi-teja-co-star-siya-gautam-gets-married

See also  Keerthy Suresh: దసరా సినిమాలో నటించాక.. ఆ హీరో పై మనసు పడిపోయానంటున్న కీర్తి సురేష్!

ఆ తర్వాత హిందీ, కన్నడ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికి అక్కడ ఈ భామ క్లిక్ కాలేకపోయింది. అలా ఈ బామ్మ నెమ్మ నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతున్న తరుణంలో సుదీర్ఘ కాలం తర్వాత గోపీచంద్ – మారుతి కాంబోలో వచ్చిన పక్కా కమర్షియల్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా శియా గౌతమ్ పెళ్లి పీటలెక్కింది నిఖిల్ పాల్కేవాలా అనే వ్యాపారవేత్తతో సోమవారం నాడు శియా గౌతమ్ యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ravi-teja-co-star-siya-gautam-gets-married

See also  Nandamuri Bala Krishna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చినమామ బాలకృష్ణ చేసిన పనికి ఏమని పోస్ట్ చేసిందో తెలుసా.??

ఈ పెళ్లికి ప్రియమణి దంపతులు కూడా హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. అంతేకాక కొంతమంది సినీ తారలు కూడా సియా గౌతమ్ వివాహంలో తలుక్కుమన్నారు. పెళ్లితోపాటు సంగీత్, మెహంది వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు శియా గౌతమ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం అవి వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.