సినిమా : రావణాసుర ( Ravanasura movie )
నటీనటులు: రవి తేజ, సుశాంత్, అనూ ఇమాన్యుల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్, జయరామ్..
మాటలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్, భీమ్స్ సిసిరోలియో
కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల: 7 ఏప్రిల్ 2023 ( Ravanasura release date ) (Ravanasura telugu movie best review and rating )
మాస్ మహారాజ్ రవితేజ ( Raviteja ) హీరోగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా రావణాసుర ( Ravanasura ) ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చాల ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే.. ఇది రవితేజ 70 వ సినిమా, ఈ సినిమాలో 5 గురు హీరోయిన్స్ ఉన్నారు. రావణాసుర సినిమా నిర్మాణంలో ( Ravanasura movie budget ) రవితేజ కూడా ఉన్నారు. అంతేకాదు రవితేజ ఒక త్రిల్లర్ సినిమాలో నటించడం కూడా ఇదే మొదటి సారి. ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమాపై మరి ఎలాంటి అంచనాలో ఉంటాయో (Ravanasura Telegu movie best review and rating) మనందరికీ తెలిసినదే. మరి ఇన్ని అంచనాలకు రీచ్ అయ్యిందో లేదో తెలుసుకుందామా..
కథ ( Ravanasura movie story )
సినిమా మొదలు ఒక హత్యతో మొదలవుతుంది. అక్కడ నుంచి ముఖ్య పాత్రలు ఎంటర్ అవుతాయి. కనకమహాలక్ష్మి ( Faria Abdullah ) అనే ఒక లీడింగ్ లాయర్ దగ్గర రవీంద్ర ( Ravi Teja ) జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. కనకమహాలక్ష్మి రవీంద్ర కి బాస్ మాత్రమే కాదు, కాలేజీ ఫ్రెండ్ కూడా. వీళ్ళ దగ్గరకి హారిక ( Megha Akash ) సినిమా మొదట్లో జరిగిన హత్య కేసుని వాదించమని, అది కూడా మర్డర్ చేసిన వాడి తరుపున వాదించమని వస్తుంది. కనమహాలక్ష్మి దానికి నో అంటుంది. కానీ రవీంద్ర ( Ravi Teja ) హారికని చూసిన వెంటనే లవ్ లో పడ్డానని, ఎలాగైనా ఈ కేసు ఒప్పుకుంటే తనకి దగ్గర అవుతానని ఒప్పుకోమని కనమహాలక్ష్మి ని ఒప్పిస్తాడు. అలా ఆ కేసు ఒప్పుకున్న తరువాత వరుసగా ఒకే నమూనాలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరు చేస్తున్నారో తెలిసినా కూడా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈ హత్యల్లో రాము ( Sushanth Akkieni ) పాత్ర ఏమిటి? అసలు రవి ఈ కేసుని ఎందుకు ఒప్పుకున్నాడు? చివరికి హత్యలు చేసిన వాడిని ఎం చేస్తారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే.. ( Ravanasura Telegu movie best review and rating )
ఈ సినిమా మొదలు పెట్టడం మాత్రం ఏదో హైప్ తేవాలని, చాలా త్రిల్లింగా తీయాలని అనుకుని దర్శకుడు సినిమా మొదలు పెట్టాడు. కానీ మొదలు పెట్టిన తీరు గాని, ఆ నటుల నటన గాని చాలా సాధారణంగా అనిపించాయి తప్పా, పెద్ద త్రిల్లర్ సినిమా మొదలులా ఫీలింగ్ రాకపోయినా, త్రిల్లర్ సినిమా అంటూ ప్రమోషన్ ఎక్కువగా చేసుకోవడం వలన పోనీ అలా ఫీల్ అవుదామని ఆ కొద్దీ నిమషాలు అనుకున్నారు ఆడియన్స్. ఆ తరవాత సినిమాని చాలా కూల్ గా మొదలు పెట్టించి.. అందులో హీరోని (Ravanasura telugu movie best review and rating ) సామాన్యుడిలా కామెడీ గా చూపించాలని చూసాడు. కానీ దరిద్రం ఏమిటంటే.. ఈ సినిమాలో హీరో లాయర్ అని, వాడు క్రిమినల్ లాయర్ కాదు, లా చదివిన క్రిమినల్ అని ట్రైలర్ లో చెప్పడం వలన, ఆ లాయర్ ఎంత సామాన్యుడిలా కామెడీ గా నటించినా కూడా దాన్ని ఆడియన్స్ అస్సలు ఎంజాయ్ చెయ్యలేదు.
ఇక ఈ సినిమాలో కనకమహాలక్ష్మి కి రవీంద్ర కి మధ్య ఉన్న స్నేహం, డైలాగ్స్, కెమిస్ట్రీ పరవాలేదు యావరేజ్ గా బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం బోర్ గా ఉంది. అసలు దర్శకుడు గాని, సినిమా టీం గాని ప్రమోషన్స్ లో ఎక్కడైనా ఒకటే మాట చెప్పారు. అదేమిటంటే త్రిల్లర్ మూవీ అని చెప్పారు గాని.. మొత్తం సినిమాలో ఎక్కడా కూడా అమ్మో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతాదో అనే భయం ఏమి కలగలేదు. కేవలం ఒక మాస్క్ ని ఆధారంగా పెట్టుకుని సినిమా మొత్తం క్రైమ్ అంతటిని ప్లాన్ చెయ్యడానికి, దర్శుకుడు సీరియల్స్ లెవల్ కి వెళ్లిపోయాడా అనిపించింది. అసలు ఈ సినిమాలో క్రైమ్ చెయ్యడానికి క్రిమినల్ లా చదివిన బ్రెయిన్ ఎక్కడా కూడా కనిపించలేదు. కనీసం ఇప్పుడు ఓటిటి లో వస్తున్న త్రిల్లర్ సీరియల్స్ చూసి కథ రాసుకున్నా, కొంచెం ఇంతకంటే బాగా కథ రాసుకున్ను అనిపించింది.
ఇకపోతే ఈ సినిమాకి మొత్తం అంతా రవితేజానే అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అవును మొత్తం సినిమా అంతా రవి తేజాతో ఏదో కొత్త కోణాన్ని చూపించాలనే ఆత్రంలో, అసలు సినిమాని ఎలా తీస్తున్నారో కూడా చూసుకోలేదనిపించింది. ఇది ఎవరు చేసి ఉంటారు అని ప్రేక్షకుడు ఆలోచించే లోపే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ తో ఆ సీక్రెట్ చెప్పేస్తాడు. ఇంక ప్రేక్షకుడు దేనికి అక్కడ కూర్చుని సినిమా చూస్తున్నట్టు. మేమె ఒక సస్పెన్సు క్రియేట్ చేస్తాం, మేమె వెంటనే అది రివీల్ చేసేస్తాము.. మీరు టికెట్ కొనుక్కున్నారు కాబట్టి అస్సలు బ్రెయిన్ కి స్ట్రెస్ ఇవ్వకండి అన్నట్టు ఉంది. అసలు సినిమా మూల కథ అయితే చాలా రొటీన్ గా ఉంది. పోనీ రొటీన్ లేకుండా ఎంతకని, ఎన్ని కథలని రాస్తారు అని అనుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రొటీన్ కథలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ దానిని ఏదో ఒక రూపంలో.. కామెడీ తోనో, సస్పెన్సు తోనో, సూపర్ పెర్ఫాన్స్ తోనో, సెంటిమెంట్ తోనో , రొమాన్స్ తోనో, లవ్ తోనో , సూపర్ యాక్షన్ తోనో ఏదో ఒక మూలాన్ని గట్టిగా పట్టుకుని ఆ పాత కథని మళ్ళి ఆడియన్స్ తో సినిమా బాగుంది అని అనిపించుకుంటారు. కానీ ఈ సినిమాలో త్రిల్లర్, సస్పెన్సు, లవ్, రొమాన్స్, (Ravanasura Telegu movie best review and rating ) సూపర్ యాక్షన్, మ్యూజికల్ హిట్, కామెడీ ఏదీ వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఇక ఈ సినిమాలో సుశాంత్ పాత్ర గురించి, అతని నటన గురించి చాలా హైప్ చేసి చెప్పారు. పాపం అందువలన సుశాంత్ ఈ సినిమాలో ఎంత బాగున్నా.. ఎంత నటించినా కూడా గొప్పగా అనిపించలేదు, పైగా మనం ఊహించిన పాత్ర కూడా కాదు.
ఇక హీరోయిన్స్ దగ్గరికి వస్తే.. సాధారణంగా ఇప్పటి వరకు ఎక్కువగా ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఎక్కువగా చూసాం. ఏకంగా ఈ సినిమాలో 5 గురు హీరోయిన్స్ అని వార్తలు తెగ వచ్చాయి. ఈ సినిమాలో 5గురు హీరోయిన్స్ గా నటించిన నటులు ఉన్నారు తప్పా, 5 గురు హీరోయిన్స్ కాదు. హీరోయిన్ అంటే హీరో తో ఆ పాత్రకి ఒకరకమైన కెమిస్ట్రీ ఉండే పాత్ర అవ్వాలి. అలాంటి పాత్రాలు ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. కనకమహాలక్ష్మి పాత్రతో మొదలయిన ఒక హీరోయిన్ పాపం సినిమా లో సడెన్ గా రోల్ క్లోజ్ అయిపోతాది. మిగిలిన హీరోయిన్స్ ని అలా అక్కడక్కడా కథకి దగ్గరగా బాగానే సర్దాడు. ఇక అసలైన మెయిన్ హీరోయిన్ ఎందుకు ఉందొ, ఎందుకు హీరోని లవ్ చేసిందో మనకి మాత్రమే చెప్పలేదని కాదు.. డైరెక్టర్ కి కూడా పెద్దగా తెలీదు.
కామెడీ దగ్గరకు వస్తే.. మనం ట్రైలర్ లో చూసిన చిన్న చిన్న కామెడీ కంటే పెద్ద ఎక్కువ ఏమీ లేదు. ఇకపోతే రవితేజ.. ఈ పాత్ర గురించి మనం చెప్పుకోవాలంటే.. ఈ సినిమాలో రవితేజ మంచి గ్లామర్ గా ఉన్నాడు. తనకు ఈ సినిమా కథ నచ్చడమే కాకుండా, నిర్మాణంలో కూడా ఉన్నాడు కాబట్టి.. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతాదని, స్టోరీ చాలా బలమైనదని, తన పాత్ర ఇంకా అద్భుతం అని తనలో తాను చాలా ఫీల్ అవుతూ సినిమా నటించాడని అర్ధం అవుతుంది. రవి తేజ 70 వ సినిమా అంటే ఆయన అభిమానులు ఆశించినట్టు ఏమీ ఈ సినిమాలో కొత్తగా కనిపించలేదు. నిజానికి చెప్పాలంటే తన 70 వ సినిమాలో ఇంతవరకు నటించని పాత్రను చూపించాలని అనుకున్నాడు గాని, ఇంతకంటే బెస్ట్ పాత్రను చూపించాలని అనుకోలేదు.
మొదట ఒక సినిమాకి విలన్ పేరు ఎన్నుకుని పెట్టారంటే.. ఆ సినిమాలో తమ హీరోకి విలన్ పేరు కూడా సూపర్ అని అనిపించేలా ఒప్పించడం చాలా కష్టం. అది రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు ప్లాన్ చేసూకోకూడదు. ఠాగూర్ సినిమాలో హీరో అందరిని చంపిస్తాడు. దానికి కారణం చెప్పిన తర్వాత కడుపులో బిడ్డని, ఒడిలో చంటి బిడ్డని పెట్టుకుని తానూ ఎందుకు చనిపోతున్నానో తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరిచ్చిన నివాళి నిజంగా సరైనది అనే డైలాగ్ ఆ పాత్ర అలా చెయ్యడంలో తప్పు లేదని ప్రేక్షకులందూ ఒప్పుకుని తీరాలి. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే ఇలాంటివి అనేక సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో హీరో రావణాసురుడు అయ్యి తీరాలి అని ప్రేక్షకుడు ఎక్కడా కూడా ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు.
కేవలం ఆ ఫీలింగ్ సినిమా తీసిన వాళ్లకి, నటించిన వాళ్లకి ఉంటె సరిపోదు.. అల్టిమేట్ గా ప్రేక్షకుడికి అనిపించేలా తియ్యాలి. దానికి తగ్గ కథ గాని, స్క్రీన్ ప్లే గాని ఏమి ఈ సినిమాలో లేవు. అయితే రవితేజ తన వంతు పని తాను ఎప్పుడూ ఎంత గట్టిగా చేస్తాడో అలానే ఈ సినిమాలో కూడా కష్టపడ్డాడు. డాన్స్ (Ravanasura telugu movie best review and rating ) బాగానే వేసాడు. లుక్ అండ్ స్టైల్ బాగుంది. కాకపోతే ఒక కొత్త హీరో సీనియర్ హీరో పాటను తీసుకుని సినిమాలో పెట్టుకోవడం సహజంగా చూసాము గాని, రవి తేజ లాంటి సీనియర్ హీరో కొత్తగా అలాంటి ప్రయోగానికి ఒప్పుకోవడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ తో సెక్స్ రిలేటెడ్ మూమెంట్స్ తప్ప.. లవ్ గాని, సెంటిమెంట్ గాని, కనీసం గ్లామర్ రోల్ గా గాని ఎక్కడా చూపించడానికి పాపం టైం దొరకలేదు. అన్నిటికంటే ఈ సినిమాకి మైనస్ ఏమిటంటే.. మూల కథని ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు.. దాని కంటే బ్యాడ్ లక్ ఏమిటంటే.. వీళ్ళ ప్రమోషన్ కి బాగా కనెక్ట్ అయిపోయి, వాళ్ళ అంచనాలకి సినిమా అందక చాల నిరాశ చెందారు. మొత్తం మీద అన్ని సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఈ సినిమాని కూడా చూడచ్చు.
ఈ రివ్యూ కేవలం ఒక ప్రేక్షకుడు చూసిన కోణం మాత్రమే.. అసలైన రివ్యూ మీకు మీరే ఇచ్చుకోవాలి.
రేటింగ్: 2.25/5