Home Cinema Rajamouli – Rashmika : రాజమౌళికి రష్మిక కి అలాంటి కనెక్షన్ ఉందట.. బయటపడ్డ కొత్త...

Rajamouli – Rashmika : రాజమౌళికి రష్మిక కి అలాంటి కనెక్షన్ ఉందట.. బయటపడ్డ కొత్త విషయం..

rashmika-mandanna-speech-about-rajamouli-at-the-animal-movie-pre-release-event

Rajamouli – Rashmika :సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా రూపొందిన చిత్రం యానిమల్. ఈ సినిమాపై సినీ అభిమానులు అందరికీ కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ( Rajamouli and Rashmika ) ప్రమోషన్ కూడా అంత హై లెవెల్ లోనే చేస్తున్నారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ మీద విపరీతమైన నమ్మకం ఉండడం వలన.. అందులో ఆ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత.. అందులో రన్బీర్ కపూర్ యాక్షన్ గాని ఇవన్నీ చూస్తూ ఉంటే.. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరగక తప్పడం లేదు. ఇక డిసెంబర్ ఒకటో తేదీ రిలీజ్ సిద్ధంగా ఉన్న ఈ సినిమా గురించి ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Rahmika-commetns-about-Rajamouli-in-Animal-event

27వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి గెస్ట్లుగా మహేష్ బాబు, రాజమౌళి రావడం జరిగింది. ఇంకా ఈ చిత్రంలో నటించిన నటీనటులు.. హీరో రణ్బీర్ కపూర్ , హీరోయిన్ రష్మిక మందన్న , అనిల్ కపూర్ , బాబి డయల్ వీళ్ళందరూ ( Rajamouli and Rashmika ) కూడా వచ్చారు. ఇక సందీప్ రెడ్డివంగా పడిన కష్టం గురించి, అతని ఆలోచన విధానం గురించి, సినిమా తీసిన విధానం గురించి,సినిమా ట్రైలర్ చూసి ఒక్కొక్కరికి ఏమనిపించింది అనే దాని గురించి.. ఈవెంట్లో చాలా చక్కగా చెప్పారు. ఇది విన్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూడాలని ఆత్రం రోజురోజుకీ పెరుగుతూ ఉంది.

See also  Prabhas: పెళ్లిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్.. మొత్తానికి ఫ్యాన్స్ కల నెరవేరబోతుందోచ్

Rahmika-commetns-about-Rajamouli-Animal-movie

ఇక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ గా సుమ చేసింది. సుమ రష్మికాని ముందుకు పిలిచి.. తనని మాట్లాడమని చెప్పగా.. రష్మిక మొదటిగా అభిమానులందరినీ పలకరించి.. ఆ తర్వాత మహేష్ బాబు గురించి మాట్లాడింది. మహేష్ బాబు గారు ఈ ఈవెంట్ కు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని.. ఆయనకు థాంక్స్ చెప్పుకుంటున్నాను అని ( Rajamouli and Rashmika )చెప్పింది. ఆ తర్వాత రష్మిక.. రాజమౌళి గురించి మాట్లాడింది. రాజమౌళి లాంటి దర్శకుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని ఆయనకు కూడా థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా రాజమౌళిని మొదటిసారి పుష్ప ఈవెంట్ ఫంక్షన్ లో కలిశానని, ఇప్పుడు రెండోసారి అనిమల్ ఈవెంట్ ఫంక్షన్ లో కలుస్తున్నానని చెప్పింది.

See also  లైంగిక వేధింపులపై దుమారం రేపుతున్న నటి రోహిణి కామెంట్స్..

Rahmika-commetns-about-Rajamouli-Pushpa

అంతేకాకుండా రాజమౌళి వైపు తిరిగి చూసి.. మనిద్దరి మధ్య ఏదో బ్లాక్ బస్టర్ కనెక్షన్ ఉంది సార్ అని చెప్పింది. దీనితో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ హర్షధ్వనులు వినిపించారు. అయితే రష్మిక.. రాజమౌళి తో మనిద్దరి మధ్యన బ్లాక్ బస్టర్ కనెక్షన్ ఉంది అని అనడం వెనక ఏ కారణం ఉంటుంది అని నెటిజనులు ఆలోచించడం మొదలుపెట్టారు. రష్మిక పాన్ ఇండియా సినిమాలో నటించి ఎంత పేరు సంపాదించుకుందో.. బాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు సంపాదించుకుందాం పుష్పా సినిమా తర్వాత మనందరికీ తెలిసిందే. అలాంటిది రాజమౌళి సినిమాలోకి గాని తనకు అవకాశం దొరికితే.. ఇక అసలు తిరుగుండనన్న విషయం ఆమెకు తెలుసు. అందుకే మనిద్దరి కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని.. మనిద్దరి మధ్యన బ్లాక్ బస్టర్ లాంటి రిలేషన్ ఉందని.. అంతమందిలో రాజమౌళికి చెప్పడం వెనక అర్థం అని.. నాకు మీ సినిమాల అవకాశం ఇవ్వండి అని అడిగినట్టా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా అనిమల్ సినిమా గాని బ్లాక్ బస్టర్ హీట్ అయితే వీళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ కనెక్షన్ అని ఒప్పుకోక తప్పదు.