Home Cinema Rashmika Mandanna : రష్మిక ప్రతీ సినిమాకి రెమ్యునిరేషన్ పాటు అది కూడా అడుగుతాదట.. మామూలుది...

Rashmika Mandanna : రష్మిక ప్రతీ సినిమాకి రెమ్యునిరేషన్ పాటు అది కూడా అడుగుతాదట.. మామూలుది కాదు..

rashmika-mandanna-put-conditions-for-film-directors

Rashmika Mandanna : ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక కి ఎంత డిమాండ్ ఉంది అనేది మనందరికీ తెలిసిందే. కన్నడ భామ అయిన రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చలో సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. కన్నడలో ( Rashmika Mandanna put conditions ) హీరోయిన్ గా నటించడం మొదలు పెట్టిన రష్మిక మొదట అక్కడ కొంత పేరు సంపాదించుకొని.. ఆ క్రేజ్ తో తెలుగులో అడుగుపెట్టి.. ఇక్కడ అదిరిపోయే ఆఫర్స్ ని కొట్టింది. చలో, గీతాగోవిందం సరి లేరు నీకెవ్వరూ, పుష్ప ఇలాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక డిమాండ్ క్రియేట్ చేసుకుంది.

Rashmika-Madanna-condition

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉంది.అంతేకాకుండా రష్మిక బాలీవుడ్ లో కూడా ఆఫర్లను సంపాదించుకుంది. బాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినప్పటికీ.. ఆమె బాలీవుడ్ భామ కూడా అయ్యింది. ఇక ఆమె ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా పై అందరికీ ( Rashmika Mandanna put conditions ) విపరీతమైన అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఇక ఆ సినిమా ఎలాంటి స్థాయికి వెళ్తుందో.. మరి పుష్పాలో అల్లు అర్జున్ కి బెస్ట్ నేషనల్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. కాబట్టి ఈసారి పుష్ప 2 లో రష్మిక తో ఏవైనా అదిరిపోయే యాక్షన్ చేయించి.. ఏ అవార్డు తెప్పిస్తాడేమో సుకుమార్ అని కూడా అనుకుంటున్నారు.

See also  Ayesha Takia: ప్రేమించినోడి కోసం తన సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..

Rashmika-Madanna-movie

ఇప్పటికే పుష్పాలో డిగ్లామర్ గా నటించిన రష్మిక ఎందరో మన్ననలను పొందింది. ఇదిలా ఉంటే రష్మిక ఒప్పుకునే ప్రతి సినిమాకి కూడా ప్రొడ్యూసర్లకి కొన్ని కండిషన్స్ పెడతాదంట. అందులో ముఖ్యంగా ఒక కండిషన్ మాత్రం తెలుగు ( Rashmika Mandanna put conditions ) వాళ్ళకి ఖచ్చితంగా పెడుతుందట. అదేమిటంటే సినిమా ఒప్పుకుంటే పలానా డేట్స్ కావాలి అని అడిగితే కచ్చితంగా ఆ డేట్స్ లోనే షూటింగ్ చేయాలి తప్పితే.. ఆ డేట్స్ తప్పించి వేరొక డేట్స్ ఇవ్వనని చెప్తాదంట. ఒకవేళ ఆ డేట్స్ చేయ లేకపోతే అక్కడికక్కడే వాళ్ళు రెమ్యునిరేషన్ తిరిగి ఇచ్చేస్తా తప్ప మళ్ళీ ఇబ్బంది పడనని ముందుగానే చెప్తాదంట. ఈ కండిషన్ బాలీవుడ్ వాళ్లకు మాత్రం పెట్టదంట.

See also  Hi Nanna public talk : హాయ్ నాన్న పై పబ్లిక్ టాక్ కన్నీళ్లు తెప్పిస్తుంది..

Rashmika-Madanna-condition-viral

ఎందుకింత పక్షపాతం అనుకుంటున్నారా? బాలీవుడ్ వాళ్ళు ఏదైనా ఒక డేట్స్ తీసుకుంటే.. ఖచ్చితంగా ఆ డేట్ లో షూటింగ్ చేసేస్తారంట. వాళ్ళు ఎటువంటి ఆబ్లికేషన్స్ పెట్టడంట. తెలుగు వాళ్ళు మాత్రం షూటింగ్ చేస్తామని చెప్పి.. ఆ డేటుల్లో చేయకుండా.. ఇంకో పది రోజులు తర్వాత మొదలుపెడతా ఉంటారు అంట. దానివల్ల ఆమె ఒప్పుకున్న ఇంకొక సినిమా డేట్స్ ఇబ్బంది పడుతుందట. అందుకనే ఆమె ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా.. సినిమా ఒప్పుకుంటే పలానా డేట్స్ అంటే ఆ డేట్స్ లోనే చేస్తాను అలా అనుకుంటేనే తీసుకోండి అని చెప్తాదంట. అంత స్ట్రిక్ట్ గా ఉండి,అంత జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి నేషనల్ క్రష్ అయింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.