Home Cinema Rashmika Mandanna: అలాంటి నొప్పులు తెలిస్తేనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన...

Rashmika Mandanna: అలాంటి నొప్పులు తెలిస్తేనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన్న.

Rashmika Comment: తెలుగు చిత్ర పరిశ్రమ లోనే కాక మరే చిత్ర పరిశ్రమంలో నైనా హీరోయిన్ గా అడుగు పెట్టాలంటే అతి ముఖ్యమైనది అందం. ఆ తర్వాతే మరి ఏదైనా.. వీటన్నిటికీ తోడుగా అదృష్టం కూడా కలిసి రావాలి. పైగా అదృష్టం ఆశ మాశీగా రాదు. వాటన్నిటికీ కలగలిపి ఫర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి. అలా ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాల్ని చేజిక్కించుకోగలుగుతాం. కొన్నేళ్ల పార్టీ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపుకుంటూ ముందుకి కొనసాగుతూ అవకాశాలు అందుకోగలుగుతావు. ఇవన్నీ జరిగితే స్టార్ హీరోయిన్ గా మారుతాం..

Actress Rashmika Mandanna

అయితే ముందు ఇవన్నీ కావాలంటే వీటన్నిటికంటే ముందు స్టార్ హీరోయిన్ గా మారాలంటే అందం అనేది చాలా ముఖ్యం. అందుకే హీరోయిన్లు హీరోయిన్ అవ్వగానే చేతులు దులుపుకుంటే సరిపోదు అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతుంటారు. డైట్ అంటూ ఫాలో అవుతుంటారు నచ్చిన ఫుడ్ ని ఇష్టంగా కడుపునిండా తినలేదు. ఇక ఉదయాన్నే వ్యాయామం అయితే తప్పనిసరి. శరీరానికి సంబంధించిన ఎక్ససైజ్ లు చేసుకోవడంలో చాలా కఠినంగా ఉంటారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అవి ఫాలో అవుతుంటారు. ఇష్టమైనది ఫుడ్ ని దూరంలో పెట్టి ఇష్టం లేని ఫుడ్ తింటూ బాడీని కరెక్ట్ షేప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంత మంది హీరోయిన్ రోజులో గంటలు గంటలు జిమ్ లకే పరిమితం చేస్తుంటారు.

See also  Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

Rashmika Mandanna

అలాంటి హీరోయిన్లలో రష్మిక మందన కూడా ఒకరు. ఇక తాజాగా చాలా సోషల్ మీడియా ఖాతాలో రష్మిక మందన (Rashmika Comment) ఎంతో కష్టంగా కఠినాతి కఠినంగా ఎక్సర్సైజులు చేస్తున్న అందుకు సంబంధించిన వీడియో ని పోస్ట్ చేయడంతో అది ఒక్క సారిగా వైరల్ అయింది. ఆ వీడియో చూస్తే ఒకసారి మనకు అర్థం అవుతుంది రష్మిక తను అందాన్ని బాడీ ఫిజిక్ ని కాపాడుకోడానికి ఎంతలా కష్టపడుతుందో మనకు అర్థమవుతుంది.

See also  EXTRA ordinary man : నితిన్ సినిమా టైటిల్ వెనుక అసలు రియాలిటీ ఇదేనట!

Actress Rashmika Mandanna GYM

భారీ బరువులను ఎత్తుతూ వాటి వల్ల ఆ బాధ కలిగినప్పుడు భరించలేక తనను తాను కంట్రోల్ చేస్తూ అరుస్తూ కష్టతరమైన ఎక్సర్సైజులు చేస్తుంది. దాంతో హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి నొప్పులు భరించాల్సిందే అలాంటి కఠినమైన నొప్పులు భరిస్తేనే స్టార్ హీరోయిన్ గా మారతారు అంటూ రష్మిక ఆ వీడియో రూపంలో మనకు చెప్పకనే చెప్పింది. దాంతో ఒక్క సారి సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. రష్మిక మందన అభిమానులు ఎంత కష్టపడుతున్న రష్మిక వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. దాంతో ఒక్కసారిగా ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చింది.