
Rashmika Mandanna : తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న రష్మిక మందన గురించి మనందరికీ తెలిసిందే. రష్మిక మందన నటించిన సినిమా అంటే సినీ అభిమానులందరికీ ( Rashmika is helping girls’ education ) ఒక ప్రత్యేకతగా అనిపిస్తుంది. ఆమె నటించిన సినిమా కథలు కూడా ఒక ప్రత్యేకమైన విలువలను కలిగి ఉండేలా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో గీతాగోవిందం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని సినిమా. ఆ సినిమాలో ఆమె సింపుల్గా నటించేసిన అంత అద్భుతమైన నటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేకపోతున్నారు.
ఇక రష్మిక మందన పుష్ప సినిమాలో మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాలో నటించింది. పాన్ ఇండియా సినిమాలో నటించిన తర్వాత ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. పుష్ప సినిమాలో అటువంటి మేకప్ తో,ఎంతో డిమ్ముగా కూడా ఆమె నటనతో అందరినీ మనసులని ఆకట్టుకుంది. రష్మిక లో( Rashmika is helping girls’ education ) అటువంటి నటి కూడా ఉందని సుకుమార్ బయటకు తీసుకువచ్చి మరి చూపించాడు. ఇక పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది. ఎంత మేరకు చూపించబోతున్నారు, ఆమెకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ కనిపించడం లేదు.
ఇకపోతే రష్మిక మందన్న హిందీలో రన్బీర్ కపూర్ తో నటించిన సినిమా యానిమల్. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికీ రిలీజ్ అయ్యి మంచి అంచనాలను సంపాదించుకుంది. తెలుగు ఆడియోస్ కి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అది హిందీ సినిమా అయినప్పటికీ కూడా అందులో రష్మిక మందన తెలుగు వాళ్ళకి బాగా ( Rashmika is helping girls’ education ) పరిచయమైన హీరోయిన్ అయ్యి ఉండడం, అంతేకాకుండా ఆ సినిమా స్టోరీ గాని, సెంటిమెంట్ గాని తెలుగు వాళ్ళ మనసుని హత్తుకునేలా ఉండడం ఒక విశేషం. ట్రైలర్ చూస్తున్న విధానాన్ని బట్టి ఈ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. అంతేకాకుండా తండ్రి మీద ఉన్న సెంటిమెంట్ మాతో ఒకవైపు భార్య అయిన రష్మిక మీద విపరీతమైన ప్రేమతో.. మరోవైపు ఆ తండ్రికి తన భార్య మీద పడకపోతుంటే.. ఇద్దరినీ క్యారీ చేయడం ఇంకోవైపు ట్రైలర్ లో చూపించారు.
ఈ సెంటిమెంట్స్ అన్నిటితో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక మందన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి తన పర్సనల్ విషయాల గురించి అనేక విషయాన్ని పంచుకుంది. తాను కెరీర్లో నెమ్మదిగా సక్సెస్ అవుతున్నానని, ఇక పర్సనల్ లైఫ్ లో చేయాల్సింది ఒక పని ఉందని.. ఆడపిల్లలకు సహాయం చేయాలని, వారిని బాగా చదివించాలని తన కోరికనే చెప్పుకొచ్చింది. ఇప్పటికే రష్మిక మందన్న ఆడపిల్లలు చదువులకు హెల్ప్ చేస్తుందన్న విషయం బయటకు వచ్చింది. అయితే తనకి ఓన్ గా ఒక ఫౌండేషన్ పెట్టాలని ఉంది గాని.. అది చూసుకోవడానికి చాలా ప్రతిభ ఉన్న వాళ్ళు కావాల్సి వస్తుందని, అలాంటి వాళ్ళు దొరికే వరకు తాను వేరే ఫౌండేషన్ ద్వారానే హెల్ప్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కెరీర్లో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న రష్మిక ఇంత బిజీగా ఉన్న టైంలో కూడా.. ఇలాంటి పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫౌండేషన్ ద్వారా ఆడపిల్లలకు చదువుని ఇస్తున్న రష్మిక గుణాన్ని చూసి అభిమానులు ఎంతగానో పొంగిపోతున్నారు.