Rashmika : ఆఫీసుల్లో, పెద్ద పెద్ద వ్యాపారాల్లో మాత్రమే కాదు మేనేజర్లు ఉండేది.. సెలబ్రిటీస్ కి కూడా మేనేజర్ అనే వాడు ఉంటాడు. ప్రతి సెలెబ్రెటీకి ఒక మేనేజర్ కచ్చితంగా ఉంటాడు. అలాగే సినిమా రంగంలో నటించే నటులకు మేనేజర్ అనే వ్యక్తి చాలా అవసరం. ఎందుకంటే వాళ్లు అందరితోని వాళ్ళ డేట్స్ గురించి, వాళ్లు ( Rashmika Mandanna got cheated by her manager ) రెమ్యూనరేషన్ గురించి క్లియర్గా నటులు మాట్లాడలేరు.. వాళ్ళకు సంబంధించిన డేట్స్ గురించి, రెమ్యూనరేషన్ గురించి, వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన వెహికల్స్ గురించి, నటులకు ఏం కావాలో అన్ని అవతల వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చేది మేనేజర్లే. అందుకే మేనేజర్ కి ప్రాముఖ్యత అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎంత సెలెబ్రెటీ కైనా వాళ్లకి సంబంధించినవి చూసుకునేది పర్సనల్గా మేనేజర్ కాబట్టి..
అలాగే రష్మిక మందన ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతుంది. గీత గోవిందం సినిమాతో ఆమెపై అంచనాల భారీ స్థాయికి వెళ్తే.. పుష్ప సినిమాతో ఆమె స్థాయి బాలీవుడ్ ను తాకేసింది. బాలీవుడ్ లో ( Rashmika Mandanna got cheated by her manager ) కూడా ఆమె సినిమాలు చేస్తూ.. తన కెరీర్ని తాను స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంది. చూడడానికి చాలా సామాన్యమైన నటిలా కనిపించే రష్మిక.. ఇంత పెద్ద స్టార్ అవ్వడం నిజంగా ఆమె కృషి, పట్టుదల అని అనుకోవాలి. అయితే ఇటీవల రష్మిక మందన తన మేనేజర్ కిరణ్ తో సపరేట్ అయిపోయానని.. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయామని అఫీషియల్ గా చెప్పడం జరిగింది.
బయటకు అయితే ఇలా చెప్పారు కానీ.. నిజానికి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే రష్మిక మందన కిరణ్ ని తన మేనేజర్ గా తొలగించిందని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే కిరణ్ అనే వ్యక్తి ఆమె నుంచి మానేసి వెళ్లిపోయినా కూడా.. అతను కావాలని రష్మికని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. పైగా ( Rashmika Mandanna got cheated by her manager ) టాలీవుడ్ లో ఆమెకు స్థానం లేకుండా చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా సినిమా చేయబోతున్నట్టు.. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ.. ఆ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దానికి కారణం కిరణ్ అని అంటున్నారు.
ఈ మేనేజర్ ప్రతి సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, దర్శకులకి, వాళ్ల మేనేజర్ల దగ్గరకు వెళ్లి.. రష్మిక మీద నెగటివ్ ప్రచారం చేస్తున్నాడంట. ఆమె టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని.. ఎక్కువగా బాలీవుడ్ మీదే చూపిస్తుందని.. ఒకవేళ మీ సినిమాల్లో తీసుకున్న కూడా డేట్స్ సరిగ్గా ఇవ్వదని.. చెప్పిన సమయానికి రాదని.. ఆమె శ్రద్ధ అంతా బాలీవుడ్ మీదే ఉండడం వల్ల ఇక్కడ సినిమాలు ఒప్పుకున్నా కూడా న్యాయం చేయలేదని.. అతను అందరికీ చెప్తున్నాడు అంట. అందువల్లే ఆ సినిమా నుంచి రష్మిక మందనని తప్పించారని.. ఇక టాలీవుడ్ లో రష్మిక కి ఫ్యూచర్ లేకుండా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఎవరి జీవితాన్ని ఎవరైనా ఇలా చేయడం అనేది అనవసరం.. అన్నిటికి ఆ భగవంతుడే ఉన్నాడని, ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చుగా.. ఎందుకు ఇలాంటి కక్షలు, కుతంత్రాలు అని నెటిజనులు వాపోతున్నారు.