
Rashmika : ప్రస్తుతం రష్మిక మందన్న యానిమల్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ( Rashmika comments on Madhavi Devarakonda ) యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సినీ వర్గానికి, అభిమానులకు అందరకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా ఈ సినిమాని కచ్చితంగా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడని అందరూ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇక రష్మిక గురించి ఏమైనా మాట్లాడుకుంటే ఎవరైనా కూడా వెంటనే విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడతారు. అలాగే విజయ్ దేవరకొండ గురించి ఏం మాట్లాడుకున్నా వెంటనే రష్మిక గురించి కూడా మాట్లాడుకుంటారు. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించుకుంటున్నారని.. వీళ్ళిద్దరి మధ్యన ఖచ్చితంగా ఏదో ఉందని.. వీళ్లిద్దరు ( Rashmika comments on Madhavi Devarakonda ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మాత్రం దేన్నీ కూడా ఎప్పుడు బయటికి చెప్పలేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఉన్నారు.
ఇటీవల దీపావళి రోజున కూడా విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో కుటుంబంతో ఫొటోస్ పెడితే.. రష్మిక వేరేచోట ఫొటోస్ పెడితే ఈ రెండు ఒకే ప్లేస్ అని, దీపావళిలో ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారని నెటిజనులు కనిపెట్టేశారు. ఇలా నెటిజనులు ఎప్పుడు వాళ్ళ మీద ఏదో కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ అనే ( Rashmika comments on Madhavi Devarakonda ) ప్రోగ్రామ్ కి యానిమల్ ప్రమోషన్ కోసం వచ్చిన బాలయ్య అడుగుతున్న ప్రశ్నలకి.. అలాగే విజయ్ దేవరకొండ కి కాల్ చేస్తే మాట్లాడేటప్పుడు రష్మిక పడిన సిగ్గుకి.. అవన్నీ చూసి కూడా కచ్చితంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని అందరూ నమ్మారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఒక్క పోస్ట్ తో రష్మిక.. విజయ్ దేవరకొండని కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు.
యానిమల్ ప్రమోషన్స్ నిమిత్తం రష్మిక ఒక సింగర్ షో కు వెళ్ళింది. అక్కడ దివ్యాంగురాలు అయిన ఓ గాయనని రష్మిక విపరీతంగా మెచ్చుకుంది. మెచ్చుకోవడమే కాకుండా ఆ గాయని అంటే.. విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ కి చాలా ఇష్టమని.. ఆమె కూడా నిన్ను చాలా ఇష్టపడుతుందని చెప్పింది. మాధవి దేవరకొండ నాకు ఇంకొక మదర్ లాంటిదని చెప్పింది. దీంతో విజయ్ దేవరకొండ తల్లి గురించి అంత పబ్లిక్ లో ఆమె ఇష్ట ఇష్టాల గురించి రష్మిక చెప్పడం చూసి.. కచ్చితంగా ఆ ఇంటి కోడలు కాబోతుందని.. అందుకే విజయ్ దేవరకొండ మదర్ గురించి రష్మిక పబ్లిక్ లో అలాగా చెప్పగలిగిందని అంటున్నారు. అంతేకాకుండా రాధికా మాధవి దేవరకొండ గురించి మాట్లాడిన ఆ వీడే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.