Home Cinema Rashmika – Diwali : కాబోయే అత్తారింట్లో దీపావళి సీక్రెట్ గా జరుపుకున్న రష్మిక..

Rashmika – Diwali : కాబోయే అత్తారింట్లో దీపావళి సీక్రెట్ గా జరుపుకున్న రష్మిక..

rashmika-madanna-went-to-vijay-devarakonda-house-for-diwali-celebration

Rashmika – Diwali : రష్మిక మందన్న అనగానే గుర్తొచ్చే హీరో విజయ్ దేవరకొండ. రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. రష్మిక పక్క నిలబడితే మాత్రం అచ్చం లవర్ బాయ్ లా ఉంటాడు. విజయ్ దేవరకొండ ( Rashmika Madanna Diwali celebration ) వీళ్ళిద్దరూ కలిసి నటించి, కలిసి ఒక చోట కనిపించినా.. సినీ అభిమానులందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ జోడి అంత చూడచక్కగా ఉంటుందని అంటారు. అయితే ఇది అభిమానులు ఇతరులు అనే మాట మాత్రమే కాదు, వీళ్లిద్దరూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడో చోట కలుస్తూ ఉంటారు. వీళ్లిద్దరిపై అందరూ ఒక కన్నేసి ఉంచుతారు.

Rashmika-Diwali-Vijay-Devarakonda-photos

ఒకపక్క విజయ్ దేవరకొండ తన కెరీర్ నిలబెట్టుకునేందుకు తన సినిమాల మీద తన దృష్టి పెడుతూ ఉంటే.. మరోపక్క రష్మిక యానిమల్ సినిమాలో బోల్డ్ గా నటించి.. ఆ సినిమా డిసెంబర్ ఒకటో తేదీ ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా రష్మిక పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు ( Rashmika Madanna Diwali celebration ) సంపాదించుకోవడమే కాకుండా.. పుష్ప 2 సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. వీటన్నిటితో రష్మిక ఎంత బిజీగా ఉంది అనేది మన అందరికి తెలిసిందే. వీటితోపాటు బాలీవుడ్ లో కూడా రష్మిక కొన్ని సినిమాలు నటించింది. వాటి ద్వారా అంత పేరు సంపాదించుకోలేకపోయినా కూడా బాలీవుడ్ కి అయితే ఎంటర్ అయింది కదా అని అనుకుంటున్నారు.

See also  Ravanasura review rating: రావణాసుర రివ్యూ మరియు రేటింగ్

Rashmika-Diwali-Vijay-Devarakonda-photos-viral

నిన్న దీపావళి వేడుకని సినీ సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఎంతో ఘనంగా చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తన ఇంట్లో ఇంపార్టెంట్ సెలబ్రెటీస్ ని పిలిచి దీపావళి వేడుకను ఎంతో ఘనంగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ కూడా తన ఇంట్లో.. తన అమ్మ – నాన్న, తమ్ముడు తో కలిసి దీపావళి వేడుక ( Rashmika Madanna Diwali celebration ) చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ దేవరకొండ భూచక్రాన్ని వెలిగిస్తూ పరిగెడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే ఇదే తరుణంలో రష్మిక కూడా హ్యాపీ దీవాలి అంటూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

See also  Ankita Jhaveri: ఎన్టీఆర్ హీరోయిన్ మళ్ళీ ఎన్టీఆర్ తో జతకట్ట బోతుందా.? లక్ అంటే ఇదేనేమో..

Rashmika-Diwali-Vijay-Devarakonda

ఆ ఫోటోలో రష్మిక మందన్న ఒక చెక్క సోఫాలో కూర్చొని మంచి స్టిల్ ఇచ్చింది. అయితే ఆ సోఫా వెనుక ఉన్న వాల్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా విజయ్ దేవరకొండ తన ఇంట్లో తీసుకున్న ఫోటోలు బ్యాగ్రౌండ్ కి మ్యాచ్ అవుతుందని.. అంటే రష్మిక కచ్చితంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి దీపావళిని సెలబ్రేట్ చేసుకుందని అభిమానులు అంటున్నారు. దీనితో రష్మిక తప్పకుండా విజయ్ దేవర కొండని పెళ్లి చేసుకుంటుందని.. అత్తారింట్లో అడుగు పెట్టి దీపావళి ఎంజాయ్ చేసింది అని.. కొందరు అంటున్నారు. ఏదేమైనా అది ఎంతవరకు నిజమో విజయ్ దేవరకొండ తో తన ప్రయాణం ఏమిటో ఇవన్నీ రష్మికనే చెప్పాలి.