Home Cinema Rashmika: రష్మిక పేరున కోట్ల ఆస్తి.. అదెలా వచ్చిందంటే.

Rashmika: రష్మిక పేరున కోట్ల ఆస్తి.. అదెలా వచ్చిందంటే.

చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రష్మిక అడుగుపెట్టింది . మొదటి సినిమానే సూపర్ హిట్ అయ్యింది. అక్కడ నుంచి తెలుగు ప్రేక్షకులు ఆమెను చాల బాగా ఆదరించారు. మొదటి సినిమా మొదలు ఇప్పటి వరకు ఆమె ఎక్కడ బ్రేక్ లేకుండా, శరవేగంతో సినిమా ప్రపంచంలో దూసుకుపోతుంది. గీతాగోవిందం సినిమా ఈమె జీవితంలో ఒక పెద్ద మలుపు.

ఆ సినిమాలో ఈమె అందం, నటన అన్ని పాపులర్ అయ్యాయి. నటిగా మంచి స్థానం సంపాదించుకుంది. అల్లుఅర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో ఈమె ఫేమ్ మరిన్ని రేట్లు పెరిగిపోయింది. అందులో మేకప్ అనేది లేకుండా, చాలా చక్కని పాత్రని ఎంతో అద్భుతంగా నటించింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన కూడా జంకు లేకుండా, తన పాత్రలో తాను మునిగిపోయింది.

See also  Ileana: ఇలియానా కోసం ఎగబడే తెలుగు హీరోలు.. ఆమె పేరు చెబితేనే పరుగులు పెడుతున్నారు కారణం.??

రష్మిక సౌత్ తో పాటు నార్త్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అవి కాకుండా మోడలింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంది. వీటన్నిటితో రెండు చేతులా డబ్బు ఎంత బాగా సంపాదించుకోవాలో, కరెక్ట్ గా ప్లానింగ్ గా ఎలా వెళ్లాలో రష్మికకు బాగానే తెలుస్తుంది. రష్మిక ఇండస్ట్రీ కి వచ్చి ఆరేడేళ్లు అవుతుంది. ఎక్కడ టైం వేస్ట్ అవ్వనివ్వకుండా బాగానే సంపాదించిందని వార్తలు వస్తున్నాయి.

ర‌ష్మిక పేరిట ఐదు ప్రదేశాల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయని, 2021లో బ్యాక్ టు బ్యాక్ ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ కొన్ని కోట్లు ఉంటుందని,మొత్తం మీద చాలా కోట్ల ఆస్తిని రష్మిక కూడబెట్టిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి రష్మిక.. అలా ఉండి ఉంటె బాగున్ను అని సోషల్ మీడియాలో జవాబు ఇచ్చింది.