Rashmika : ఒక సినిమా చేసేటప్పుడు, అందులో పాత్రలని రాసేటప్పుడు, దర్శకుడు ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అనేది వెతుక్కుంటాడు. కానీ సందీప్ రెడ్డి వంగ రాసే సినిమాలో ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అనేది ఎంత ప్రాధాన్యమో.. అసలు ( Rashmika comments about her role ) ఆ పాత్ర చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు అనేది కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుంది. అలాంటి క్రమంలోనే ఆయన తీసిన ప్రతి సినిమా అర్జున్ రెడ్డి నుంచి అనిమల్ సినిమా వరకు కూడా ఆ చిత్రంలో అలాంటి పాత్రను నటించడానికి ఒప్పుకున్న నటుల నుంచే అతను తన పాత్రకి న్యాయం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటాదని గమనించవచ్చు.
రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా ఎంత ప్రభంజనాన్ని సృష్టిస్తుందో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా 550 కోట్లను రాబట్టింది. మినిమం 700 కోట్ల వరకు ఈ సినిమా వెళ్తుందని వర్గాలు చెబుతున్నాయి. నిజంగా ఈ సినిమా ఇంత ( Rashmika comments about her role ) రాబట్టడం ఒకవైపు అద్భుతమైతే.. మరోవైపు పాజిటివ్ మరియు నెగిటివ్ కామెంట్స్ తోనే దూసుకుపోతున్న సినిమాగా సంచలనానికి ఎక్కుతుంది. ఈ సినిమాపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయో వింటూనే ఉన్నాం. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని పొగుడుతూ ఉన్నా కూడా.. మరో పక్కనుంచి విమర్శకులు మాత్రమే విమర్శించడం ఆపడం లేదు.
ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రష్మిక గురించి ఎవరు కూడా వదలడం లేదు. రష్మిక ఎందుకు ఇలాంటి పాత్ర చేసింది? స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక ఇలాంటి పాత్రగా ఒప్పుకోవాల్సిన అవసరం ఏం పట్టింది? ఎందుకంత బోల్డ్ గా నటించింది అంటూ ఆమెను ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క ( Rashmika comments about her role ) ఆమె అభిమానులు సాధారణమైన కొంతమంది నెటిజలు కూడా ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారు. అది కేవలం పాత్ర మాత్రమే.. సినిమాలో పాత్రను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆమెను కామెంట్ చేయాల్సిన పనిలేదని అంటూ ఉన్నారు. అయినా కూడా ఆమె ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడటం లేదు. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న రష్మిక ఇప్పుడు మొదటిసారిగా రెస్పాండ్ అయ్యింది.
రష్మిక తన మీద వస్తున్న ట్రోల్స్ కి వ్యతిరేకంగా రెస్పాండ్ అయింది. నేను ఆ పాత్రని చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆ పాత్రలో నేను ఒక తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది అని చూపించే విధంగా ఉంటుంది. అదే నేను చేశాను. నాకు అలాంటి పాత్ర నన్ను నమ్మి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని పోస్ట్ పెట్టింది. దీనితో కొందరు పాజిటివ్గా తీసుకుంటే.. మరికొందరు విపరీతమైన నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అందులో పిల్లల కోసం తల్లి చేసిందేముంది? పిల్లల కోసం పిల్లల్ని పోషించుకోవడానికి ఏమీ చేయలేదు? కేవలం బోల్డ్ యాక్షన్ గురించి కామెంట్స్ చేస్తుంటే.. దానికి దీనికి సంబంధం లేకుండా రష్మిక కామెంట్ చేస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక పాత్రను గౌరవించి ఒక నటుడు చేసినప్పుడు.. అది నచ్చితే మనం చూడడం, నచ్చకపోతే మానేయడమే అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి రష్మిక ఇంత కాలానికి ఏదో ఒక రూపంలో రియాక్ట్ అయిందని ఇంకొందరు అనుకుంటున్నారు.