Home Cinema Rashmika : మొత్తానికి రష్మికతో ఆ సీక్రెట్ బయట పెట్టించిన బాలకృష్ణ..

Rashmika : మొత్తానికి రష్మికతో ఆ సీక్రెట్ బయట పెట్టించిన బాలకృష్ణ..

rashmika-and-balakrishna-in-unstoppable-program

Rashmika : ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ రష్మిక మందన్న మంచి బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో. శ్రీలీల లాగా ఎక్కువ సినిమాలు చేతిలో పెట్టుకోకపోయినా కూడా.. రష్మిక కూడా ( Rashmika and Balakrishna ) వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అయితే రష్మిక పుష్ప సినిమాతో ఆమె బ్రాండ్ ఎక్కడకో వెళ్ళిపోయింది. పాన్ ఇండియా సినిమాకి హీరోయిన్గా నటించి, పైగా ఆ సినిమాలో తన పాత్ర హైలెట్ గా ఉండి, ఆమె ఒక అట్రాక్షన్ గా నిలబడడంతో ఆమెకు అనేక ఆఫర్స్ వచ్చాయి. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమెకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి.

Rashmika-Balakrishna-un- stopable

అయితే బాలీవుడ్లో నటించిన సినిమాలు ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆమెకు విపరీతమైన క్రేజ్ గాని పేరు గాని ఏమి తెచ్చిపెట్టలేదు. కానీ ఇప్పుడు డిసెంబర్ ఒకటో తేదీన బాలీవుడ్లో ఆమె సినిమా రిలీజ్ కాబోతోంది. అదే సినిమా ( Rashmika and Balakrishna ) తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. రష్మిక హీరోయిన్గా చేస్తున్న అనిమల్ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అందరికీ. ఇక సినిమాపై పక్కన పెడితే.. సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మి రష్మికపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

See also  లైంగిక వేధింపులపై దుమారం రేపుతున్న నటి రోహిణి కామెంట్స్..

Rahmika-Balakrishna-ranbhir-kapoor-sandeep

ఈ సినిమాలో రష్మిక మందన్న లిప్ లాక్ సీన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ట్రైలర్, టీజర్ చూస్తేనే అభిమానులు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కుర్రాళ్లకు కూడా ఈ సినిమా ( Rashmika and Balakrishna ) బాగా నచ్చేలా అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడడంతో ప్రమోషన్స్ గట్టిగా సాగుతున్నాయి. అదే క్రమంలో ఈ సినిమా చిత్ర బృందం వాళ్ళు అన్ష్టాపబుల్ విత్ నందమూరి బాలకృష్ణ ప్రోగ్రాం కి వచ్చారు. ఆ ప్రోగ్రాం లో అనేక విషయాలను పంచుకున్నారు. ఇక వాళ్ళు పంచుకోకూడదు అనుకున్న విషయాలను కూడా బాలయ్య అయితే మాత్రం గట్టిగానే బయటికి లాగారు.

See also  Bichagadu : బిచ్చగాడికి రెండు వేల నోట్ల రద్దుకు సంబంధం గుర్తించారా?

Rashmika-secret-Balakrishna-ask

అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో ఎంత పాపులారిటీ సంపాదించిందో మనకు బాగా తెలుసు. ఈ ప్రోగ్రాం చూడాలని అందరూ ఇష్టపడతారు. ఈ ప్రోగ్రాం లో ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తూ.. ఆయన మాట్లాడే మాటలు, అడిగే ప్రశ్నలు, నవ్వించే విధానం చాలా చక్కగా ఉంటుంది. అదే క్రమంలో రష్మీకి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్నది ఏంటో తెలుసుకోవడానికి కూడా బాలకృష్ణ కష్టపడ్డారు. బాలకృష్ణ ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళిద్దరూ మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నారు. అయితే దర్శకుడు సందీప్ వంగని, హీరో రణ్బీర్ కపూర్ ని బాలయోగ ప్రశ్న అడిగారు.. మీకు షూటింగ్ లేనప్పుడు రష్మికని కలవాలంటే ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. షూటింగ్ లేకపోతే రష్మిక ఒక ప్లేస్ లోనే కచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఎక్కడ అని అడిగితే.. జిమ్లో ఉంటుంది అని చెప్పారు. రష్మిక ఎంతో కష్టపడి జిమ్ చేస్తూ తన పర్సనాలిటీని ఎప్పుడూ అందంగా ఉండేలా చూసుకుంటుంది అనే సీక్రెట్ మొత్తానికి బాలయ్య బయటకు లాగారు..