Home Cinema Rangamarthanda Movie review: రంగ మార్థండా రివ్యూ రేటింగ్.. అమ్మ నాన్న ఉన్న ప్రతి ఒక్కరూ...

Rangamarthanda Movie review: రంగ మార్థండా రివ్యూ రేటింగ్.. అమ్మ నాన్న ఉన్న ప్రతి ఒక్కరూ ఎందుకు చూడాలంటే..

Rangamarthanda telugu Movie review: రంగమార్తాండ

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ నటించగా.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈరోజు అనగా 22/03/2023 న రంగమార్థండా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చాలా రోజుల క్రితం నుంచి తీస్తున్నారు కానీ, కరోనా కష్టాలను దాటుకుని మొత్తానికి ఈరోజుకి మన ముందుకు వచ్చింది. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ లేకుండా కృష్ణవంశీ సెలెక్ట్ చేసుకున్న ఈ సినిమా మరాఠి భాషలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరాఠి లో ఈ సినిమాని నానా పాటేకర్ నటించాడు. ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు తెలుగులో ఆ పాత్రను ప్రకాష్ రాజ్ పోషించారు. మరి నానాపాటేకర్ నటించిన పాత్రని ప్రకాష్ రాజ్ ఎలా చేసి ఉంటారు? మన తెలుగు వాళ్ళ మనసును ఏమాత్రం దోచుకుని ఉంటారో తెలియాలంటే సినిమా స్టోరీలోకి వెల్దాము..

కథ..
రాఘవరావు (ప్రకాశ్ రాజ్) రంగస్థలంపై మహానటునిగా ఒక వెలుగు వెలుగుతాడు. అతని రిటైర్మెంట్ అయ్యే సమయంలో అతనికి రంగమార్తాండ అనే బిరుదునివ్వడంతో పాటు, స్వర్ణ కంకణం కూడా తొడుగుతారు. అన్నేళ్ళుగా అనేక పాత్రలను నటించి, ఇక తన కుటుంబంతో హాయిగా గడపాలని రాఘవరావు అనుకుంటాడు. రాఘవరావు భార్య గా రమ్యకృష్ణ నటించింది. రాఘవరావు తన ఇంటిని కోడలు గీత (అనసూయ) కు రాసి ఇస్తాడు. అలాగే తన బంగారం, డబ్బుని శ్రీదేవి (శివాత్మిక)కి ఇస్తాడు. మనకంటూ ఏమి ఉంచుకోకుండా, మొత్తం పిల్లకు ముందుగా ఎందుకు ఇవ్వడం అని భార్య చెప్పినా కూడా రాఘవరావు వినడు. రాఘవరావుకు చక్రపాణి (బ్రహ్మానందం) మంచి స్నేహితుడు. రాఘవరావు కూతురు ఒక అబ్బాయిని ప్రేమించగా ముందు పెళ్ళికి రాఘవరావు ఒప్పుకోడు. తరవాత తన మిత్రుడు నచ్చజెప్పగా, అతను ఒప్పుకుని కూతురికి నచ్చిన సంబంధం చేస్తాడు.

See also  Jawan Trailer Telegu review : జవాన్ ట్రైలర్ చూసి అందులో ఈ పాయింట్స్ నిజమేనా చెప్పండి..

rangamarthanda-telugu-movie-review

రాఘవరావు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అందువలన రాఘవరావుకు కోడలితో పడదు. అంతే కాకుండా తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని కొడుకు రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ), కోడలు గీత డెవలప్మెంట్ కి ఇవ్వాలని సిద్ధపడతారు. అందువలన రాఘవరావు దంపతులు కూతురి ఇంటికి వెళ్తారు. అక్కడ కూతురు వీళ్లని చులకనగా చూడటమే కాకుండా, రాఘవరావు పై దొంగతనం మోపుతాది. అక్కడ కూడా వాళ్ళు ఉండలేని పరిస్థితి ఏర్పడతాది. ఇంక పిల్లల దగ్గర వద్దు మన సొంత ఊరు వెళ్ళిపోదామని రాఘవరావు భార్య అంటుంది. అప్పుడు రాఘవరావు ఏం చేస్తాడు, మిగిలిన కథ ఏమిటి? చివరికి ఏమౌతుంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సినదే..

See also  Prabhas - Anushka : పెళ్లి గడియలు మొదలు.. ప్రభాస్ ని కలిసిన అనుష్క తండ్రి..

rangamarthanda-telugu-movie-review

రివ్యూ.. (Rangamarthanda telugu Movie review)

సినిమా మొదలు చూడటానికి ఏదో నాటకం చూస్తున్నట్టు, నీర్శంగా ఉన్నట్టు ఉంటాది. అలాగే కథ కూడా మొదలు నుంచి చూస్తే.. ఇంతకు ముందు ఎన్నో సినిమాలు ఇలాంటి కథతో వచ్చాయని అనిపిస్తది. కని నిమ్మదిగా సినిమా ముందుకు వెళ్లే కొద్దీ, సినిమా కథ కంటే అందులో ఒక్కొక్క సన్నివేశం ఎలా ఆడియన్స్ ని ఆకుట్టుకుంది అనే దానిపై సినిమా ఉంటాది. కొన్ని సన్నివేశాలను సినిమాలో ప్రతీ ఒక్కోరు ఏదో ఒక పాత్రలో వారి వారి పాత్రను ఊహించుకుని ఫీల్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం స్నేహ బంధాన్ని చాలా అద్భుతంగా తీసాడు. కొన్ని సీన్స్ సినిమాని చాలా గట్టిగా నిలబెట్టాయి. అలాగే స్కూల్స్ లో విద్యా విధానం ఎలా ఉంటుంది, తెలుగు భాషకి ఉన్న ప్రాముఖ్యత చాలా బాగా చూపించారు. కృష్ణవంశీ తన దర్శక ప్రతిభను బాగానే చూపించారు. ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి చెప్పుకోనక్కరలేదు, చాలా బాగా చేశారు. రమ్యకృష్ణ తన పాత్రకు తాను చాలా ఈజీగా న్యాయం చేసారు.

rangamarthanda-telugu-movie-review

 

అలాగే ముఖ్యంగా బ్రహ్మానందం అద్భుతంగా పాత్రని నిలబెట్టడమే కాకూండా, సినిమాకి కొన్ని హైలెట్స్ నిలబెట్టారు. ఇలా మొత్తం మీద సినిమా బాగానే ఉంది. అయితే ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా తల్లితండ్రులు ఉన్న ప్రతీ ఒక్కరూ చూడాలి. ఎందుకంటే కమ్మని ఆవకాయ ఎక్కడో తిన్నట్టే ఉంటాది. కానీ వేడి వేడి అన్నంలో దాని రుచి ఎప్పుడు అద్భుతంగానే ఉంటది. అలాగే తల్లితండ్రుల పరిస్థితి గురించి తీసిన ఈ సినిమాకి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. తల్లితండ్రులు వృద్దులు అయ్యి చనిపోయి, వాళ్ళ పిల్లలు చూస్తే.. వాళ్ళ తల్లి తండ్రులకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేసారో తెలుస్కోవచ్చు. అలాగే వాళ్లకు ఇప్పుడు ఎలా న్యాయం చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తల్లితండ్రులను చూడాల్సిన స్థితిలో ఉన్నవాళ్లు చూస్తే.. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దాని వలన వాళ్ళ తల్లితండ్రుల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోగలరు. అలాగే చిన్న పిల్లలు చూడటం వలన అసలు కుటుంబం అంటే ఏమిటి? ఎవరి రోల్ కి ఎలాంటి ప్రాధాన్యత ఉంటది అనేది కచ్చితంగా తెలుస్తాది. అందుకని తల్లితండ్రులు ఉన్న ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా ఈ సినిమా చేస్తే మంచే జరుగుతుంది..

See also  Leo First Day Collection : లియో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

రేటింగ్: 3/5