Home Cinema Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ మరియు రష్మిక లు కలిసి అక్కడ...

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ మరియు రష్మిక లు కలిసి అక్కడ అడ్డంగా దొరికిపోయారు..

ranbir-kapoor-revealed-that-vijay-devarakonda-and-rashmika-mandanna-relation

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఈ జంట అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ( Vijay Devarakonda Rashmika and Ranbhir ) వీళ్ళిద్దరూ మాత్రం అటువంటిదేమీ లేదు అన్నట్టు చాలా సైలెంట్ గా ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నా.. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసినప్పుడు గానీ, ఎక్కడైనా కలుసుకున్నప్పుడు గానీ, వాళ్లలో ఒకరితో ఇంకొకరి గురించి ఏమైనా మాట్లాడినప్పుడు గాని.. వాళ్ళ ఫేస్ లో కనిపించే ఫీలింగ్స్ ను చూసి ప్రేక్షకులంతా కూడా కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అంటూనే ఉంటారు.

Vijaya-Devarakonda-Rashmika-Ranbhir-kapoor

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ మొత్తం వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని డిసైడ్ అయితే, ఇప్పుడు అనిమల్ సినిమాలో రష్మిక నటించడంతో అక్కడ కూడా బాగా వీళ్ళిద్దరి గురించే పాపులర్ అవుతుంది. విజయ్ దేవరకొండ,రష్మిక మధ్యన (Vijay Devarakonda Rashmika and Ranbhir ) ఖచ్చితంగా ఏదో ఉందంటూ బాలీవుడ్ మాటలు కూడా వినిపిస్తున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటో తేదీని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో విశేషం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి అందరికీ తెలుసు.

See also  Indraja: దసరా పాటకు డాన్స్ దంచి కొట్టిన ఇంద్రజ.. వామ్మో ఈ వయసులో కూడా మామూలుగా ఇరగదీయ్యలేదుగా

Vijaya-Rashmika-Ranbhir

విజయ్ దేవరకొండ కి అంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, గీతాగోవిందం లాంటి సినిమాలో విజయ్ దేవరకొండ తో నటించి విజయ్ దేవరకొండ లవర్ అని పేరు సంపాదించుకున్న రష్మిక.. వీళ్లిద్దరితో కలిసి రన్బీర్ కపూర్ పనిచేస్తున్న సినిమా యానిమల్. అందుకే రన్బీర్ కపూర్ కి మొత్తం టాలీవుడ్ లో ( Vijay Devarakonda Rashmika and Ranbhir ) ఏం జరిగిందో బాగా వీళ్ళిద్దరి ద్వారా ఇంకా బాగా తెలిసే అవకాశం ఉంది. యానిమల్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ చేసుకునే క్రమంలో.. అనిమల్ సినిమా టీం వాళ్ళు.. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి వచ్చారు. అక్కడ పలు విషయాలు మాట్లాడుతూ.. రన్బీర్ కపూర్ ఒక ముఖ్యమైన సీక్రెట్ ని బయటపెట్టేసాడు.

See also  Mahesh Babu - Namratha : మహేష్ నమ్రతల పెళ్ళి తో త్రిష కి ఉన్న లింక్ ఏమిటంటే..

Vijaya-Rashmika-Ranbhir-comments

యానిమల్ సినిమా గురించి రన్బీర్ కపూర్ పలు మాటలు మాట్లాడుతూ.. రష్మిక గురించి మాట్లాడుతూ.. మధ్యలో బాలకృష్ణ విజయ్ దేవరకొండ రష్మిక గురించి మాట్లాడుతూ ఉంటే.. ఆ మాటల్లో రన్బీర్ కపూర్ యానిమల్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ మేడపై రష్మికను చూడగానే అని టంగ్ స్లిప్పయి వెంటనే ఆగిపోయాడు. అంటే రష్మిక ఫ్రీక్వెంట్ గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్తుందని, వాళ్ళ మేడ మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారని అన్న విషయాన్ని రన్బీర్ కపూర్ బయట పెట్టేసాడు అన్నమాట. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న రష్మిక ఇప్పటికీ విజయ్ దేవరకొండ ఇంటికెళ్లి అంత ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదీ లేదంటే ఎవరు నమ్ముతారు అని అభిమానులు కోడై కూస్తున్నారు.