Home Cinema Animal First Day Collection : అనిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో...

Animal First Day Collection : అనిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

ranbir-kapoor-movie-animal-first-day-collection-details

Animal First Day Collection : రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా డిసెంబర్ 1 వ తేదీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ ( Animal First Day Collection ) అంచనాలతో భారతదేశం మొత్తం ఎదురుచూసింది. అందులో ముఖ్యంగా బాలీవుడ్ , టాలీవుడ్ వాళ్ళు విపరీతంగా ఎదురు చూశారు. ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగ తెలుగు దర్శకుడు కనక.. తెలుగుఆడియన్స్ అంచనాల పెంచుకున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగత తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

Animal-movie-first-day

ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో తీసి మళ్లీ అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. అందుకే అందరికీ సందీప్ రెడ్డివంగా సినిమా అంటే ఒక ప్రత్యేకమైన గురి ఉంది. దాన్ని సందీప్ రెడ్డివంగా నిలబెట్టుకుంటాడా? ఈ సినిమాను ( Animal First Day Collection ) కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా లేదా అనే ఎక్కడో ఒక మూలం అన్న అనుమానాన్ని కూడా.. మొత్తం పటాపంచలు చేశాడు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి. సినిమా చూసిన వెంటనే తెలుగు ఆడియన్స్ అందరూ కూడా సినిమా ఒక అద్భుతం అని అంటున్నారు.

See also  Star heroes: ఇంత దారుణమైన ఆరోపణలో.. మెగా పవర్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారా!

Animal-movie-first-day-collection

వైలెన్స్, రొమాన్స్, సెంటిమెంట్, మేనరిజం అన్నీ కూడా ఒక లెవెల్ దాటి ఉన్నాయని.. మూడు గంటల 20 నిమిషాల సినిమాని కూర్చొని చూడగలిగేలా తీయగలిగాడని.. నిజంగా సందీప్ రెడ్డివంగ తెలుగు దర్శకుడు అవ్వడం గర్వకారణంగా ఉందని.. తెలుగు ఆడియన్స్ అయితే కొనియాడారు. ఇక సినిమాలో అన్ని అతీతంగా ఉండడంతో.. కొంతమంది ( Animal First Day Collection ) నెగటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి అంత వైలెన్స్, రొమాన్స్ కూడా అంత అతీతంగా ఉంటే గాని.. సినిమాలు ఆడవా? ఎందుకు అంత అలా తీయాల? అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా.. పాజిటివ్ క్రేజ్ మాత్రం ఎక్కడికి పోలేదు. నెగటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా, నచ్చని వాళ్ళు కూడా ఆ సినిమా అసలు ఎలా ఉందో చూద్దామని వెళ్లే వాళ్లే ఎక్కువమంది ఉన్నారు.

See also  Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు విప్పిన మంచు లక్ష్మి..

Animal-movie-first-day-collection-details

అదే దర్శకుడి గొప్పతనం. అది మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటనతో ప్రపంచవ్యాప్తంగా పేరును సంపాదించాడు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ఇండియా మొత్తం 65 కోట్లు కలెక్షన్ రాబట్టగా.. ప్రపంచం మొత్తం కలిపి 100 కోట్లు కలెక్షన్ వచ్చింది. అంతేకాకుండా ఈ వీకెండ్ అయ్యే సరికి 350 కోట్లను కచ్చితంగా తీసుకువస్తుందని చిత్ర బృందం వాళ్ళ అంచనా వేస్తున్నారు. కేవలం వీకెండ్ అయ్యేటప్పటికి 350 కోట్లకు తీసుకురావడం అంటే మామూలు మాట కాదు. పైగా మొదటి రోజునే 100 కోట్లు కలెక్షన్ తీసుకురావడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఈ సంవత్సరంలో బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్ తీసుకొచ్చిన సినిమాల్లో ఇది మూడవ స్థానంలో నిలబడింది. ఇక ముందు ముందుకు కలెక్షన్స్ దూకుడు ఎలా ఉంటుందో, ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి..