Home Cinema Ramyakrishna: తన పెళ్ళిలో కండిషన్.. పైగా ఆ హీరోతో తనకున్న సంబంధం గురించి చెప్పేసిన రమ్యకృష్ణ.

Ramyakrishna: తన పెళ్ళిలో కండిషన్.. పైగా ఆ హీరోతో తనకున్న సంబంధం గురించి చెప్పేసిన రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అప్పట్లో కుర్రకారుని అల్లాడించిన తార రమ్యకృష్ణ. దాదాపుగా అప్పట్లో టాప్ హీరోలు అందరితో నటించేసింది. ఏ పాత్రనైనా చాలా అలవోకగా నటించేసేది. ఇక రాఘవేంద్ర రావు గారి డైరక్షన్ లో అయితే, ఆమె అందాలతో గ్లామర్ హీరోయిన్ గా అదరగొట్టేది. అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఆమె ఖాతాలో వేసుకుంది. ఆమెకంటూ హీరోలతో సమానంగా ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకుంది.

See also  Nani : హనీమూన్ లో ఉన్న వరుణ్ లావణ్యాలకి సూపర్ జర్క్ ఇచ్చిన నాని..

రమ్యకృష్ణ హీరోయిన్ గానే కాకుండా విలన్ పాత్రలను కూడా చేసి మెప్పించింది. నరసింహ సినిమాలో ఆమె నెగటివ్ పాత్ర అద్భుతంగా చేసింది. రజనీకాంత్ లాంటి హీరోతో విలన్ పాత్ర అంటే మామూలు మాట కాదు, కానీ అందులో ఆమె నటన ఆ సినిమాలో అందరినీ అధికమించింది. అలా కొంత కాలానికి కొత్త హీరోయిన్స్ వచ్చి, రమ్యకృష్ణ కి సినిమాలు తక్కువ అయ్యాయి. అలా కొంతకాలం ఆమె సినిమాలకు దూరం అయ్యింది.

See also  Tarun : వాళ్ళిద్దరి దయతో జరగబోతున్న తరుణ్ పెళ్లి.. అచ్చం అలాంటి అమ్మాయేనంట!

కొంతకాలం తరవాత రమ్యకృష్ణ మల్లి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తరవాత రమ్యకృష్ణ శివగామిని లాంటి పాత్రతో.. నెక్స్ట్ తరం వారి గుండెల్లో కూడా స్థానం సంపాదించింది. రమ్యకృష్ణ తన పెళ్ళికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తూ.. నేను రెండవ పెళ్ళివాడిని పెళ్లి చేసుకోను. అలా చేస్తే, ముందు భార్య పిల్లలకి అన్యాయం చేసినట్టే అని చెప్పింది. పెళ్ళి విషయంలో ఆమె అలాంటి కండిషన్ పెట్టిందన్నమాట.

See also  Lavanya Tripathi : తల్లి కాబోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..? బాధలో మెగా అభిమానులు..

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో రమ్యకృష్ణని, నానా పాటేకర్ తో ఉన్న సంబంధం గురించి అడగగా.. అసలు నానా కి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు.అవి వాటి పుకార్లు మాత్రమే. ఇక మా మధ్య ఏమీ లేనప్పుడు నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదంటూ తెగేసి చెప్పింది.