Ramya Krishnan: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది ఎన్నో సినిమాల్లో తనదైన శైలిలో హీరోయిన్ గా నటించి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నటి రమ్య కృష్ణ.. ఇక బాహుబలి చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా శివగామి పాత్రలో నటించిన తర్వాత మరొక్క సారి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో ఆమెకు తగ్గ పాత్రలను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులను నాటి నుండి నేటి వరకు ఉర్రూతలూగిస్తుంది. ఒకప్పుడు ఇదే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం అలాంటి క్రేజ్ తోనే సినిమాలో నటిస్తూ దూసుకుపోతుంది.
నాటి తరం హీరోయిన్లతో పోలిస్తే ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వయసు పెరుగుతున్నప్పటికీ ఏం తింటుందో మరి అన్నం కాకుండా అందం తింటుందేమో అందుకే ఇంకా ఇంత అందంగా మారుతా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేని రమ్యకృష్ణ గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఏ హీరోయిన్లకి లేని టాలెంటు రమ్యకృష్ణ ఉందంట.. అది ఆమె సొంతమైందట. మరి ఆ టాలెంట్ గురించి ఇన్నాళ్ళకు అందరికీ తెలియడంతో షాక్ కు గురవుతున్నారు. ఇక ఎన్నో చిత్రాల్లో తన దైన శైలిలో నటించిన రమ్యకృష్ణ అంతకుమించి ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె సొంతం చేసుకుంది.
ఇదే కాకుండా రమ్యకృష్ణ కి ఉన్న టాలెంట్ ఏంటంటే.. కొంతమంది స్టార్ హీరోయిన్ల కి డబ్బింగ్ కూడా చెప్పింది అంట రమ్యకృష్ణ. అవును మీరు విన్నది నిజమే.. ఆమె భర్త ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం ఖడ్గం. ఇక ఈ చిత్రం అప్పట్లో విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సంచలమైనటువంటి ఘన విజయాన్ని కైవసం చేసుకుందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే అంటే చాలు కచ్చితంగా ఖడ్గం సినిమా టీవీలలో మన చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం..
ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా.. హీరోయిన్ గా నటించిన తన ప్రేయసి సోనాలి బింద్రే పాత్రకి డబ్బింగ్ చెప్పిందట (Ramya Krishnan) రమ్యకృష్ణ.. మీరు ఇది నిజంగా నమ్మకపోవచ్చు. కానీ మీరు విన్నదే నిజం. ఇక ఈ సినిమాలోని సోనాలి బింద్రే పాత్రకు రమ్యకృష్ణ డబ్బింగ్ చెప్పిందట.. ఎన్నో సినిమాల్లో నటించిన తను తనకు తాను తన సినిమాలో కూడా ఇంతవరకు డబ్బింగ్ చెప్పుకొని రమ్యకృష్ణ మాత్రం తన భర్త నిర్మించినటువంటి ఖడ్గం చిత్రంలో ఆ హీరోయిన్ కి మాత్రం డబ్బింగ్ చెప్పిందట.. ఇక రమ్యకృష్ణ లో ఉన్న ఈ టాలెంట్ చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవడమే కాకుండా.. తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారట. ఇక ప్రస్తుతానికి మాత్రం రమ్యకృష్ణ తన దూకుడును కొనసాగిస్తూ తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటా పోతా ఉంది.