BlockBuster Super Hit Movie: తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతవరకు మునుపెన్నడూ లేని విధంగా సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా వినిపిస్తున్న పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు మాత్రమే.. మరి ఆ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంత గొప్ప పేరు రావడానికి అసలు సిసలైన కారణం జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం. అయితే ఈ చిత్రంతో ఎన్టీఆర్ చరణ్ ల పేర్లు ఏ స్థాయిలో మార్మోగిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా కోట్లాదిమంది భారతీయులు కలలు కన్న దానికోసం ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును సైతం తీసుకు రాగలిగారు. దానంతటికి కారణం వీళ్లిద్దరిలో ఉన్న గొప్ప నటన.. దాంతో వీళ్ళిద్దరి పేర్లు దేశమంతటా ఎక్కడ చూసినా మార్మోగిపోతున్నాయి.
ఇదేకాక పాన్ ఇండియా స్థాయిలో హీరోలుగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది వీళ్ళకి చిత్రం.. ఇదే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్లు సైతం వీళ్ళతో చిత్రాలు చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఓపెన్ గా కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే చిత్రంలో నటిస్తుండగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇదే కాకుండా చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా మరొక చిత్రానికి కూడా కమిట్ అయ్యాడు. నిత్యం తారక్ చరణ్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతున్న తరుణంలో.. వీళ్ళిద్దరికీ సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అయింది. అదేంటంటే.. గతంలో ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ చేయాల్సిన చిత్రం ను
రామ్ చరణ్ దోబ్బేసి మరి సూపర్ డూపర్ హిట్ ను కైవసం చేసుకున్నాడు అనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ చలామణి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకు మొదటి నుంచి తెలిసిన విషయమే.. కథల ఎంపిక విషయంలో ఆచితూచి చాలా జాగ్రత్తగా అడిగేస్తుంటాడు. బాగా ఆలోచించి సరైన కథను మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. ఐతే ఎన్టీఆర్ కి బృందావనం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లి మరొక చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ తో తీయడానికి అద్భుతమైన కథతో ఆయన ముందుకు వెళ్తాడు. కాగా ఎన్టీఆర్ కి ఆ కథ నచ్చినప్పటికీ కాల్ సీట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇక ఈ చిత్రం ఏదో కాదు రామ్ చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీగా నిలిచిన ఎవడు (BlockBuster Super Hit Movie) సినిమా.
అయితే మొదట ఈ చిత్రం యొక్క కథను డైరెక్టర్ వంశీ పైడిపల్లి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లకు చెప్పగా వారిద్దరికీ కథ చాలా బాగా నచ్చినప్పటికీ ఎన్టీఆర్ కాల్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్లే ఈ కథను వదులుకుని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అంట.. ఇక ఆ తర్వాత చేసేది ఏమీ లేక ఈ కథను తదుపరి రామ్ చరణ్ కు వివరించగా రామ్ చరణ్ ఈ కథ ఎంతో నచ్చే అందిస్పాట్ లోనే అగ్రిమెంట్ పై సంతకం చేసేసారట. కట్ చేస్తే బొమ్మ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్.. ఐతే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడట. ఇలా తారక్ – కళ్యాణ్ రామ్ లు చేయాల్సిన ఈ చిత్రం రామ్ చరణ్ – అల్లు అర్జున్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ ను వాళ్ల ఖాతాలో వేసుకున్నారు. మనందరికీ తెలుసు అప్పట్లో ఈ చిత్రం ఎంత హిట్ అయిందో 35 కోట్లతో దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే లాభాల పంట పండిస్తూ 65 కోట్లకు పైగా వసూళ్లను మూటగట్టి పెట్టింది.