Upasana Ram Charan: మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ ఉపాసనలకు 14 జూన్ 2012వ సంవత్సరంలో వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే చిరంజీవి కోడలు ఉపాసన గురించి కూడా మనందరికీ తెలుసు. ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన కడుపుతో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.. దాదాపు వీళ్ళకు పెళ్లి అయిన పది సంవత్సరాల నుండి ఒక వైపు అభిమానులు మరోవైపు మెగా కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్న న్యూస్ ని మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా తెలిపాడు.
ప్రస్తుతం ఉపాసన (Upasana Ram Charan) ఆరోనెల రన్ అవుతుంది. మరి కొద్ది నెలల్లోనే మెగాస్టార్ ఇంట పండంటి బాబు లేదా పాప పుట్టబోతున్నాడు. మెగా ఇంట మరొక వారసుడు రాబోతున్నాడు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా సంబరాల్లో మునిగితేలుతూ చాలా ఖుషి ఖుషి గా ఉంటున్నారు. ఎప్పుడూ లేనంత ఆనందంతో గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు చలామణి అవుతున్నప్పటికీ వాటన్నిటిని పట్టించుకోవడమే లేదు చూసి చూడనట్లు వదిలేయడమే చాలా బెటర్ అనుకున్నారో ఏమో.. ఒక చేవితో విని మరొక చవితో వదిలేస్తున్నారు. పని పాట లేని సోంబేరిగాళ్లు వాళ్లకి ఇష్టం వచ్చిన రాతలు రాస్తూనే ఉన్నారు.
అందులో మరొక రాత ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మెగా అభిమానులంతా కచ్చితంగా త్వరలో మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో మరొక హాట్ న్యూస్ ఉపాసనకు సంబంధించింది ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది. అదేంటంటే ఉపాసన జాతకరీత్యా ఆమెకు బాబు పుడితేనే కలిసి వస్తుందట.. పాప పుడితే అంతగా కలిసి రానే రాదంటూ న్యూస్ తెగటి ట్రెండ్ అవుతుంది. ఉపాసన జాతకంలో దోషం ఉందట ఆ దోషం కారణం చేతనే ఆమెకు పాప పుడితే ఆమె ఫేం పరంగా ఆమె పాపులారిటీ క్రేజీ ఫేమ్ అన్ని నెగటివ్ లోకి వెళ్లిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట..
అదే మగ బిడ్డ పుడితే మాత్రం మెగా ఫ్యామిలీకి మించిన అదృష్టం ఓ రేంజ్ లో నెంబర్ వన్ స్టార్ సెలబ్రిటీగా సమాజంలో పేరు సంపాదించుకుంటుందని చెబుతున్నారు. అయితే ఉపాసన మాత్రం బేబీ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ చాలా కూల్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు.. ఆమె ఓ డాక్టర్.. ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోదు. నాచురల్ గా సేఫ్ పద్ధతిలో తన డెలివరీకి ప్లాన్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇలాంటి న్యూస్ రోజుకి బొచ్చడు కొల్లలుగా వస్తూనే ఉంటాయి. అవన్నీ నిజమవ్వాలని రూల్ లేదు కదా.? అంటూ మెగా అభిమానులు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.