
Ram Charan : మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత తన క్రేజ్ ని హాలీవుడ్ లెవల్ కి తీసుకుని వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చేవరకు.. అమెరికా లో తన వంతు ( Ram Charan wife Upasana ) పని తాను చాల పట్టుదలగా చేసాడు చరణ్. ఒక పక్క రామ్ చరణ్ పెళ్లి అయిన 11 సంవత్సరములు తరవాత తండ్రి కాబోతున్నాననే ఆనందంలో ఉన్న సమయంలో తాను నటించిన సినిమాలో పాటకి ఆస్కార్ అవార్డు రావడం రామ్ చరణ్ కి ఎంతో తియ్యని అనుభూతి అని చెపుకోవచ్చు. అయితే అమెరికా వెళ్ళినప్పుడు కూడా రామ్ కడుపుతో ఉన్న తన భార్యని తనతో తీసుకుని వెళ్ళాడు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి.. ఉపాసనని చాల జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
వీలైనంత సమయం ఆమెతో గడపడానికి చూస్తున్నాడు. కానీ పాపం చరణ్ ఉన్న బిజీలో అది ఎంత కష్టమో ఊహించగలం.. అందుకే తాను ఉపాసన దగ్గర ఉండిపోవడానికి అవకాశం లేక.. తాను ఎక్కడికి వెళ్తే.. అక్కడికి ఆమెని తీసుకుని రామ్ చరణ్ వెళ్ళిపోతున్నాడు . దానితో వాళ్ళ బిడ్డ కడుపున ( Ram Charan wife Upasana ) పడిన దగ్గర నుంచి ఇద్దరూ ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారని అర్ధమవుతుంది. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమ అన్యోన్యతని, అర్ధంచేసుకునే తత్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వీళ్లిద్దరి ప్రేమకి చిహ్నం, మెగా కుటుంబానికి వారసుడు రాక మీద అందరూ ఎంతో ఆశక్తిగా ఉన్నారు.
రీసెంట్ గా ఉపాసనకు చిరంజీవి ఇంట్లో సీమంతం కూడా జరిగింది. రాబోయే బేబీ కోసం మేము కూడా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నామని ఇటీవల ఒక ఇంటగెర్వ్యూలో ఉపాసన చెప్పింది. అలాగే సోషల్ మీడియాలో ఉపాసన తన పుట్టబోయే బేబీ గురించి కొన్ని విషయాలను పంచుకుంది. పుట్టబోయే బేబీ గురించి నేను రామ్ చరణ్ ఇద్దరం ( Ram Charan wife Upasana ) ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. నాకు ప్రగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి రామ్ చరణ్ నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశాలు చూస్తున్నారు. అలాగే డెలివరీ అయిన తరవాత బేబీ తో కూడా కొన్ని రోజులు బాగా దగ్గర ఉండి గడపాలని రామ్ చరణ్ ఆశ అని చెప్పింది. అందుకే డెలివరీ కి ముందు నుంచి మూడు నెలలు పాటు రామ్ చరణ్ షూటింగ్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు.
ఇపుడు కూడా నాకు రామ్ చరణ్ చాలా సపోర్ట్ గా ఉన్నారు అని ఉపాసన చెప్పింది. మెగా బుల్లి వారసుడు రావడానికి ఇంకా 3 నెలలు టైం ఉందన్నమాట. ఉపాసన డెలివరీ 3 నెలలో ఉంది. డెలివరీ డేట్ కి కొన్ని రోజులు నుంచి మూడు నెలలు పాటు రామ్ చరణ్ షూటింగ్స్ కి దూరంగా ( Ram Charan wife Upasana ) ఉంటాడన్నమాట. జూనియర్ రామ్ చరణ్ కి పుట్టగానే తన తండ్రి కేర్ ఎంత బాగుంటాదో చూపించే గిఫ్ట్ ఇద్దామని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యే.. ఇంత బిజీలో కూడా 3 నెలలు సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడన్నమాట. నిజంగా ఈ ఆలోచన అభినందనీయం. జూనియర్ రామ్ చరణ్ కి మన హీరో ఇస్తున్న గిఫ్ట్ మాత్రం వండర్ఫుల్ గిఫ్ట్ అని అభిమానులు రామ్ చరణ్ ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.