Mega Kodalu: అవును ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్న విషయం. ఇటు సోషల్ మీడియా లో చూసినా సరే.. అటు మీడియా లో చూసినా సరే.. ఏ సెలబ్రిటీల స్టేటస్ చూసిన సరే.. అల్లు అర్జున్ పేరే ధూమ్ ధామ్ గా ఒకటే వినిపిస్తున్న పేరు. అందుకు అసలు సిసలైన కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. అదే అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడమే. 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టులో బన్నీ తొలి స్థానం ను కైవసం చేసుకున్నాడు. ఇక పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఆయనను వరించింది.
మన తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు 69 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అవార్డు అలాంటి మూమెంట్ ని తీసుకువచ్చాడు అల్లు అర్జున్. ఇక ఆయనకు జాతీయ అవార్డు దక్కడం తో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాక ఇతర అన్ని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కేవలం సెలబ్రిటీలే కాకుండా ఆయన అభిమానులు మరియు శ్రేయోభిలాషులు ఇంకా కుటుంబ సభ్యులు సైతం ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Mega Kodalu) సైతం బన్నీ కి ఓ ప్రత్యేకమైన కానుకను పంపించి మరీ శుభాకాంక్షలు తెలియజేసింది.
చాలా డిఫరెంట్ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నవ ఓ ఫ్లవర్ బొకేని బన్నీ ఇంటికి పంపిస్తూ.. మై డియర్ బన్నీ నువ్వు ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు అందుకు అర్హుడవు అంటూ ఆయనకు కంగ్రాట్యులేషన్ అని చెబుతూ ఓ నోట్ ను రాసుకు వచ్చింది. దీనికి బన్నీ సైతం ఉపాసన కు రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ అంటూ తెలియజేశాడు. ప్రస్తుతం ఉపాసన తెలియజేసిన ఆ శుభాకాంక్షలు గ్రీటింగ్స్ మరదే విధంగా బన్నీ రిప్లై ఇచ్చిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వ సాగాయి. అయితే సోషల్ మీడియా వేదికగా చాలా రోజుల నుంచి మెగా వెర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరిగిందో వాటన్నిటికీ ఉపాసన ఈ విషెస్ తో ఘాటుగా బదులిచ్చిందనే చెప్పాలి.
ఇక బన్నీ పుష్ప 2 చిత్రంతో చాలా బిజీ బజీగా ఉంటున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే..ఐతే త్వరగా సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం పూర్తయిన తర్వాత తదుపరి మరొక ప్రాజెక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్. ఏదేమైనాప్పటికీ చాలా ఏళ్ల తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమంలోని ఓ నటుడుకి జాతీయ ఉత్తమ అవార్డు దక్కడం మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో గర్వించదగ్గ విషయం. ఇక ఇదే కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమలకు దాదాపు ఆరుకు పైగా అవార్డులు వచ్చాయని మనకు తెలుస్తుంది. మన దర్శక నిర్మాతలు మన సినీ ప్రపంచాన్ని రాష్ట్రాలు దాటించి ప్రపంచం ఎత్తుకు ఎలుగెత్తి చాటుతున్నారు.