Home Cinema Pawan Kalyan: రామ్ చరణ్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కు నరకం చూపించాడట.. అసలేమయ్యింది.?

Pawan Kalyan: రామ్ చరణ్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కు నరకం చూపించాడట.. అసలేమయ్యింది.?

Pawan Kalyan: ఆహా మీడియాలో ప్రసారమవుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ 2 భాగాలుగా రానున్నది. మొదటి ఎపిసోడ్ ను బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ అనే పేరుతో ఆహా టీం ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు మనందరి ముందుకు తీసుకుని వచ్చింది. ఇందులో మొదటి భాగం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, సినిమాల గురించి ముఖ్యమైన విషయాలు పంచుకున్నాడు.

See also  Samantha : నాలుగు డిగ్రీల చలిలో సమంత అంతసేపు ఎందుకో చెప్పేసినట్టే..

ramchan-and-pawan-kalyans-viral-incident-in-singapur

తను చేసుకున్న మూడు పెళ్లిళ్లపై ఆహా షోలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి స్పందించారు. అలాగే ఈ ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాలయ్య ఫోన్ చేశారు. ఇందులో భాగంగా బాబాయి పవన్ తో తనకున్న అనుబంధాన్ని రామ్ చరణ్ మన అందరితో పంచుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఎవ్వరికీ తెలియని పలు రహస్యాలు బయటపెట్టాడు. చిన్నతనం నుండి ఎక్కువగా బాబాయ్ వద్దే పెరిగాను. నన్ను భరించకనే మా నాన్న బాబాయ్ దగ్గర వదిలేశాడు.

ramchan-and-pawan-kalyans-viral-incident-in-singapur

బాబాయ్ నాతో గంటలు గంటలు మాట్లాడి క్లాసులు పీకి హితబోధ చేసేవాడు. ఆయన చెప్పేవన్నీ ఓ పది రోజులు అలా ఫాలో అయ్యేవాడిని తర్వాత మళ్లీ మామూలే అంటూ రాంచరణ్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా రామ్ చరణ్ ఒక సెన్సేషనల్ ఎమోషనల్ ఇన్సిడెంట్ కూడా తెలియచేసాడు. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు బాబాయ్ తో సింగపూర్ కి వెళ్లాను. అక్కడ బాబాయ్ కి నేను నరకం చూపించాను. అమ్మ మాతో లేరు కదా అని రోడ్డు మీద ఏది పడితే అది తిన్నాను.

See also  Allu Arjun: అల్లు అర్జున్ తన భార్యకి తెలియకుండా ఒక లేడీ కి అలాంటి మెస్సేజ్ వైరల్.. చివరికి స్నేహారెడ్డి..

ramchan-and-pawan-kalyans-viral-incident-in-singapur

ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇష్టం వచ్చినట్లు తినేశాను దాంతో అవన్నీ తేడా కొట్టి ఒకటే వాంతులు చేసుకున్న అప్పుడు కళ్యాణ్ బాబాయ్ నేను చేసుకున్న వాంతులు తన చేతులతో క్లీన్ చేసి హోటల్ రూమ్ కి తీసుకెళ్లారు. ఆయన సింగపూర్ ట్రిప్ ని నేను మొత్తం నాశనం చేశా అంటూ  చరణ్ చెప్పుకొచ్చారు. వెంటనే బాలకృష్ణ ఐదేళ్ల పిల్లాడ్ని చంకలో పెట్టుకొని సింగపూర్ వెకేషన్ కి వెళ్లడం ఏంటమ్మా అనే సరదాగా పవన్ ను ఆటపట్టించాడు. రామ్ చరణ్ బాబాయ్ గురించి పంచుకున్న ఈ విషయాలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.