Home Cinema Ram Charan daughter : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో తెలిస్తే రచ్చ రచ్చే..

Ram Charan daughter : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో తెలిస్తే రచ్చ రచ్చే..

ram-charan-told-about-his-daughter-facial-features

Ram Charan daughter : సాధారణంగా పిల్లలు పుట్టగానే అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు పోలికల్లో ఉన్నారు అని. అమ్మ పోలిక, నాన్న పోలిక, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, మేనమామ ఇలా ఎవరు పోలికో తెలుసుకొని ( Ram Charan daughter features ) ఎవరికి వాళ్లు ఆనంద పడుతూ ఉంటారు. అందుకే ఎవరు పుట్టిన ఎవరు పోలిక అని అడుగుతారు. అలాగే అంత పెద్ద సెలబ్రిటీ అయినా రామ్ చరణ్ కి కూతురు పుట్టినా కూడా.. ఆ చిన్నారిపై కూడా అందరికీ ఉన్న ఆత్రం ఒక్కటే.. మెగా ప్రిన్సెస్ ఎవరు పోలికల్లో ఉంది? ఎలా ఉంటాది? అని ఆత్రంలో మూడు రోజుల నుంచి మెగా అభిమానులు అందరూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది అని తెలియగానే అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు.

See also  Pavitra Lokesh: పవిత్ర ఇప్పటికే ఇంతమందిని వాడుకుని వదిలేస్తే.. పాపం నరేష్ సంగతి!

ram-charan-told-about-his-daughter-facial-features

రామ్ చరణ్ కి ఉపాసనకి పెళ్లయిన ఇన్నేళ్లకి తల్లిదండ్రులయ్యే అదృష్టం కలిగినందుకు మెగా కుటుంబం ఆ భగవంతుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక చిరంజీవి ప్రెస్మీట్లో మాట్లాడేటప్పుడైతే.. ఎంతో ఆనందంగా, భావోద్వేకంతో మనవరాలు పుట్టడం నిజంగా మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని.. అది ( Ram Charan daughter features ) కూడా ఆంజనేయస్వామి మాకు మంగళవారం నాడు కలిగించాడనీ పొంగిపోతూ చెప్పారు. అంతేకాదు వాళ్ళ మనవరాలు చాలా అదృష్ట జాతకురాలని జాతకులు చెబుతున్నట్టే.. అది కడుపులో ఉండగానే మాకు కనిపించింది అని కూడా చెప్పడం జరిగింది. మనవరాలు కడుపులో ఉండగానే రామ్ చరణ్ కెరీర్ లో మంచి సక్సెస్ సాధించాడని..

ram-charan-told-about-his-daughter-facial-features

చాలా ముందుకు వెళ్లాడని.. అలాగే మా ఇంట్లో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని.. మాకు అంతా శుభమే జరుగుతుంది, చాలా బాగుందని చిరంజీవి పొంగిపోతూ చెప్పడం జరిగింది. అదే టైంలో మీడియా వాళ్ళు మనవరాలు ( Ram Charan daughter features ) ఎవరు పోలికల్లో ఉంది అని అడిగితే.. చిరంజీవి అది ఇంకా తెలీదు.. ఎవరు పోలికల్లో ఉందని నాకు కరెక్ట్ గా తెలియడం లేదు.. చూశాను గాని కొంచెం ఎదగాలని చెప్పి ఊరుకున్నారు. ఈరోజు రామ్ చరణ్, ఉపాసన పుట్టిన బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్లారు. వాళ్లిద్దరూ కూతురితో హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే.. అభిమానులు పూల వర్షం కురిపించారు.

See also  Taapsee: సినిమాలలో హీరోయిన్ గా నటించకముందు తాప్సీ అలాంటి పనులు చేసేదా.?

ram-charan-told-about-his-daughter-facial-features

ఆ క్రమంలోనే రామ్ చరణ్ ప్రెస్ మీట్ వాళ్లతో మాట్లాడటం జరిగింది. కూతురు పుట్టినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని.. మెగా అభిమానులు అందరూ పూజలు చేసినందుకు ధన్యవాదాలు అని.. మీ అందరి ఆశీస్సులు నా కూతురు మీద ఎప్పుడూ ఉండాలని కోరుకున్నాడు. అయితే పక్క నుంచి ఒకరు పాప ఎవరు పోలిక అండి అని అడిగారు. అడగ్గానే రామ్ చరణ్ ఇంకెవరిది నాదే నాలాగే ఉంటాది అని చాలా గర్వంగా ఆనందంగా ఇష్టంగా చెప్పాడు. ఎలా ఉంటదో ఇంకా చెప్పలేమని గాని, పోని వాళ్ళ అమ్మలా ఉంటాదని గాని, తాత లా , నానమ్మలా ఉంటాదని ఎవరిని పోల్చకుండా.. అంతా నాలాగే ఉంటదని చెప్పి మురిసిపోతున్న రాంచరణ్ చూసి.. అభిమానులు మా మెగా పవర్ స్టార్ లాగే.. మా మెగా ప్రిన్సెస్ పుట్టిందని రచ్చ రచ్చ చేసుకుంటూ ఆనందంతో పొంగిపోతున్నారు.